ఢిల్లీ వెళ్లిన గవర్నర్‌, ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణమా?  

Tamilisye Tour In Delhi-tamilisye

తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయం కేంద్రం వరకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.రాష్ట్రంలో జరుగుతున్న సమ్మె వివరాలను తెలుసుకునేందుకు గవర్నర్‌ తమిళిసైను ఢిల్లీకి రమ్మన్నట్లుగా తెలుస్తోంది.

Tamilisye Tour In Delhi-tamilisye-Tamilisye Tour In Delhi-Tamilisye

కేంద్ర పెద్దలు తమిళిసై వద్ద రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఇద్దరి ఆత్మహత్యకు సంబంధించిన విషయాలను తెలుసుకోబోతున్నారు.టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో అవలంభిస్తున్న తీరుపై కూడా తమిళిసై కేంద్ర పెద్దల వద్ద వివరించనున్నారు.

Tamilisye Tour In Delhi-tamilisye-Tamilisye Tour In Delhi-Tamilisye

ఇప్పటికే ఇద్దరు ఆత్మహత్య చేసుకుని బలిదానం చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ విషయం సీరియస్‌గా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.ఎలాగైనా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంను ఇరుకున పెట్టాలని కూడా బీజేపీ నాయకులు కొందరు ఆలోచిస్తున్నారు.

అందుకే ఈ విషయాన్ని కాస్త తమకు అనుకూలంగా మల్చుకోవాలని, తద్వారా తెలంగాణలో బీజేపీకి పాజిటివ్‌ బజ్‌ తీసుకు రావాలని భావిస్తున్నారు.త్వరలోనే బీజేపీ అధినాయకత్వం తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె గురించి ఒక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.

ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం పూర్తిగా కార్మికులకు మద్దతు తెలుపుతున్నారు.