తమిళిసై సౌందరాజన్‌ అనే నేను  

Tamilisai Soundararajan Oath In Telangana Governner-narasimhan,tamilisai Soundararajan,telangana

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర రెండవ గవర్నర్‌గా తమిళిసై సౌందరాజన్‌ నేడు ప్రమాణ స్వీకారం చేశారు.తమిళనాడుకు చెందిన ఈమె బీజేపీలో పలు కీలక పదవులు నిర్వహించారు.తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరించడంతో పాటు జాతీయ స్థాయిలో కూడా పార్టీ పదవులు నిర్వహించినందుకు గాను ఆమె సేవలు గుర్తించిన అధినాయకత్వం ఆమెను తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా నియమించడం జరిగింది.

Tamilisai Soundararajan Oath In Telangana Governner-narasimhan,tamilisai Soundararajan,telangana-Tamilisai Soundararajan Oath In Telangana Governner-Narasimhan Tamilisai

తెలంగాణ రాష్ట్ర మొదటి గవర్నర్‌ నరసింహన్‌ కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తి అనే విషయం తెల్సిందే.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చౌహాన్‌ నేడు ఉదయం రాజ్‌ భవన్‌లో తమిళిసైతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, స్వీకర్‌, మండలి చైర్మన్‌ ఇంకా విపక్ష పార్టీల నాయకులు హాజరు అయ్యారు.ఈ సందర్బంగా కేసీఆర్‌ మరియు ఇతరులు నూతన గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.తమిళిసై రాష్ట్రంలోని రాజ్యాంగంను, ప్రజల హక్కులను కాపాడుతానంటూ, రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తానంటూ ప్రమాణ స్వీకారం చేశారు.

అంతకు ముందు హైదరాబాద్‌కు విచ్చేసిన తమిళిసైను ముఖ్యమంత్రి మరియు మంత్రులు ఎయిర్‌ పోర్ట్‌కు వెళ్లి ఆహ్వానించడం జరిగింది.ఇక నేడు గవర్నర్‌ తమిళిసై కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.