రెండేళ్ల తర్వాత.. సింగపూర్‌లో ఘనంగా తమిళుల తైపూసం వేడుకలు..!!

కోవిడ్ మహమ్మారి ఆంక్షలు, లాక్‌డౌన్ తర్వాత సింగపూర్‌లోని తమిళ కమ్యూనిటీ వారి వార్షిక పండుగ తైపూసమ్‌ను ఆదివారం ఘనంగా జరుపుకుంది.ఈ సందర్భంగా మురుగన్‌కు తమిళులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 Tamilians In Singapore Celebrate Thaipusam Festival Details, Tamilians ,singapor-TeluguStop.com

భక్తులు తమ తలపై ఇత్తడి పాల కుండలను బ్యాలెన్స్ చేయడం, హుక్స్, సూదులతో శరీరాన్ని గుచ్చుకోవడం, కావడీలు అనే పిలవబడే చెక్క నిర్మాణాలను మోసుకెళ్లడం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయం వద్ద జరిగిన ఈ వేడుకలకు సింగపూర్ మ్యాన్ పవర్ మినిస్టర్ టాన్ సీ లెంగ్ సహా దాదాపు 35000కు పైగా భక్తులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి టాన్ సీ లెంగ్ మీడియాతో మాట్లాడుతూ.దేశంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్ధితులు నెలకొంటున్నాయని అన్నారు.ఈ క్రమంలో భక్తులు, వాలంటీర్లతో మంత్రి ముచ్చటించారు.అనంతరం ఆలయం వద్ద ఊరేగింపులో కావడీలను టాన్ వీక్షించారు.

అలాగే శ్రీ తెండాయుతపాణి దేవాలయం చుట్టూ పాలపాత్రను కూడా తీసుకెళ్లారు.వేడుకల సందర్భంగా సింగపూర్‌లో వున్న రెండు ప్రధానమైన మురుగన్ దేవాలయాల మధ్య

Telugu Hindu Festival, Lord Murugan, Singapore, Srisrinivas, Tamilians, Thaipusa

దాదాపు 450 మంది చెప్పులు లేకుండా కావడీతో 3.2 కిలోమీటర్లు ప్రయాణించారు.ఈ రెండు దేవాలయాలను తమిళనాడు నుంచి సింగపూర్‌కు వలస వచ్చిన తొలి తమిళులు నిర్మించారు.

వేడుకల సందర్భంగా ముఖం, మొండానికి 80 హుక్స్ గుచ్చుకుని, 51 ఏళ్ల తిరునావుక్కరసు సుందరం పిళ్లై తన వీల్ చైర్‌పై బ్యాలెన్స్ చేసుకుంటూ నడవటాన్ని ఆసక్తికరంగా వీక్షించారు ప్రజలు.ఇది చెక్క, లోహంతో చేసిన 30 కిలోల నిర్మాణం.

దీనిపై పిళ్లై మాట్లాడుతూ.

Telugu Hindu Festival, Lord Murugan, Singapore, Srisrinivas, Tamilians, Thaipusa

రెండేళ్ల తర్వాత కాలినడకన ఊరేగింపులో పాల్గొనడం సంతృప్తికరంగా వుందన్నారు.తమ కుటుంబ సంక్షేమం కోసం ప్రార్ధించామని పిళ్లై తెలిపారు.ఈ ఊరేగింపులో బౌద్ధ హిందూ దంపతులు కూడా పాల్గొన్నారు.

హేస్టింగ్స్ రోడ్, షార్ట్ స్ట్రీట్, క్యాథే గ్రీన్ వద్ద ఊరేగింపు మార్గంలో వున్న రెండు దేవాలయాల వద్ద సంగీత కచేరీని ఏర్పాటు చేశారు నిర్వాహకులు.ఉరుమి మేళం , ధోల్, ఘంజీరా వంటి భారతీయ సంప్రదాయ వాయిద్యాలతో కళాకారులు లయబద్ధంగా నృత్యం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube