కొత్త వ్యవసాయ చట్టాలని రద్దు చేయండి..!

రైతుల డిమాండ్లను కేంద్రం తప్పకుండా అంగీకరించాలని అంటున్నారు తమిళనాడు సిఎం ఎం.కే స్టాలిన్.

 Tamilandu Cm Demands New Farm Laws Targets Central Government, Central Governmen-TeluguStop.com

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన నిరస కార్యక్రమాలు 6 నెలలు పూర్తి చేసుకున్నాయి.ఇప్పటికే రైతులకు పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాల నుండి మద్ధతు లభించింది.

ఈ చట్టాలని వ్యరితేకంగా అసెంబ్లీలో తీర్మాణం చేస్తామని చెప్పారు స్టాలిన్.చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెడతామని అన్నారు స్టాలిన్.

అంతేకాదు ఎన్నికల హామీలన్నిటినీ నెరవేరుస్తామని అన్నారు.రైతులు ఆందోళనలు చేపట్టి ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు కేంద్రం నిర్మాణాత్మకమైన చర్చలు జరపలేదని విమర్శించారు స్టాలిన్.కేంద్రం తీరు ఆందోళనకరమని అన్నారు.రైతుల డిమాండ్లను కేంద్రం అంగీకరించాలని చెప్పారు.

వ్యవసాయ చట్టలని వెనక్కి తీసుకోవాలని సిఎం స్టాలిన్ అన్నారు.వ్యవసాయ చట్టాలని వ్యక్తిరేకిస్తూ కేంద్రాన్ని టార్గెట్ చేశారు తమిళనాడు సిఎం స్టాలిన్.

 సిఎం గా మొదటిసారి ఎంపికైన స్టాలిన్ ఎన్నికల మ్యానిఫెస్టో లో చెప్పిన హామీలన్నిటిని తప్పకుండా నెరవేరుస్తామని అన్నారు.సిఎం గా ప్రమాణస్వీకారం చేసిన టైం లోనే మేనిఫెస్టోలో ఇచ్చిన ఐదు హామీలను నెరవేర్చిన విషయం తెలిసిందే.

 ఇప్పుడు రైతులకు అండగా తమిళనాడు ప్రభుత్వం కూడా కొత్త వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube