పర్వాలేదు.. మీ సినిమాను మా థియేటర్లలో విడుదల చేయండి

కొన్ని రోజుల క్రితం సూర్య నిర్మాణంలో జ్యోతిక హీరోయిన్‌గా ఒక సినిమా రూపొందింది.తమిళంలో తెరకెక్కిన ఆ సినిమాను విడుదలకు సిద్దం చేస్తున్న సమయంలో కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో వాయిదా వేశారు.

 Tamilanadu Theaters Association Ok For Surarai Potru Movie Theatrical Release-TeluguStop.com

షూటింగ్‌ పూర్తి అయిన సినిమాను విడుదల చేసి ఓటీటీ ద్వారా విడుదల చేయాలని సూర్య భావించాడు.ఆ సమయంలో సూర్యకు వ్యతిరేకంగా థియేటర్ల యాజమాన్యాలు తీవ్రంగా మండి పడ్డాయి.

అలా ఎలా చేస్తారు అంటూ హెచ్చరించారు.ఒక వేళ ఓటీటీ రిలీజ్‌కు వెళ్తే ఇకపై మీ బ్యానర్‌ లో వచ్చే సినిమాలతో పాటు మీరు నటించిన అన్ని సినిమాలను కూడా థియేటర్లలో ఆడనిచ్చేది లేదు అంటూ తీవ్రంగా హెచ్చరించారు.

ఆ హెచ్చరికలు పట్టించుకోకుండా సూర్య ఆ సినిమాను విడుదల చేశాడు.

ఆ సినిమాను మాత్రమే కాకుండా తాను స్వయంగా నటించి నిర్మించిన సూరారై పోట్రు సినిమాను కూడా అమెజాన్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

అయితే ఈసారి థియేటర్ల వారు పెద్దగా ఆందోళన చేయలేదు.ఎందుకంటే వారు పరిస్థితి అర్థం చేసుకున్నారు.అయితే ఓటీటీలో విడుదలైన సినిమాలు ఇకపై థియేటర్లలో కనిపించవు అన్నారు.అంటే ఒక్కసారి ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సినిమాలను థియేటర్లలో ప్రదర్శించేందుకు మేము ఒప్పుకోం అంటూ యాజమాన్యాలు తీర్మానం చేశాయి.

కేవలం తమిళనాడులో మాత్రమే కాకుండా అన్ని చోట్ల ఇలాంటి తీర్మానాలు జరిగాయి.కాని సూరారై పోట్రు సినిమాకు ఆ తీర్మానంను పక్కకు పెట్టేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఎందుకంటే సూరారై పోట్రు సినిమాను థియేటర్లలో చూస్తే చాలా బాగుంటుందనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతుంది.అందుకే థియేటర్‌ రిలీజ్‌ కు యాజమాన్యాలు ఒప్పుకున్నాయి.

అమెజాన్‌లో వచ్చినా కూడా థియేటర్లలో కూడా ఈ సినిమా మంచి ఆధరణ సొంతం చేసుకుంటుందనే నమ్మకం అందరిలో ఉంది.అందుకే వారు రండి విడుదల చేసుకోండి అంటూ సూర్యకు ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube