పెళ్లి చేసుకున్న గంటలోనే కేసులు పెట్టుకున్నారు  

Tamilanadu Men Leaves His Love With In One Hour -

ఆరు నెలల పాటు వారిద్దరు ఘాడంగా ప్రేమించుకున్నారు.పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరు లేచిపోయి వెళ్లి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు.

Tamilanadu Men Leaves His Love With In One Hour

పెళ్లి చేసుకున్న గంటలోనే పోలీస్ స్టేషన్ లో ఒకరి మీద ఒకరు కిడ్నాప్ కేసు పెట్టుకున్నారు.తరువాత ప్రేమకి తూచ్ చెప్పేసి ఎవరి దారిలో వారు వెళ్ళిపోయారు.

వినడానికి ఇందాతా కాస్తా ఆశ్చర్యంగా అనిపించినా ఇలాంటి విచిత్రమైన ప్రేమ, పెళ్లి విడాకుల సంఘటన తాజాగా తమిళనాడులో జరిగింది.తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాట్టం మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న సెల్వ బాలాజీ అనే వ్యక్తి, అదే ఆఫీసులో కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన యువతి ప్రేమించుకున్నారు.

వారి ప్రేమకు ఇరు కుటుంబాల్లో పెద్దలు అంగీకరించలేదు.దాంతో గత శుక్రవారం ఆఫీసుకు వచ్చిన బాలాజీ, ఆ యువతితో కలసి బయటకు వెళ్లి పెళ్లి చేసుకున్నాడు.

కుటుంబసభ్యులు ఇద్దరిని ఎవరి ఇంటికి వారిని తీసుకెళ్ళిపోయారు.దీంతో తన భర్తకి కిడ్నాప్ చేసారని అమ్మాయి ఫిర్యాదు చేయగా.

బాలాజీ బంధువులు కూడా తమ కుమారుడిని కిడ్నాప్ చేశారంటూ కేసు పెట్టారు.ఇరువర్గాల వారిని కూర్చోబెట్టిన పోలీసులు ఇద్దరికి నచ్చజెప్పి నిర్ణయం తీసుకోమని వదిలేసారు.

దీంతో బాలాజీ, గంట క్రితం తాను పెళ్లి చేసుకున్న యువతిని వదిలేసి కుటుంబ సభ్యులతో కలసి ఇంటికి వెళ్లిపోయాడు

తాజా వార్తలు