ఆ తండ్రి కొడుకులకు సినీ ప్రముఖుల మద్దతు

తమిళ సినీ ప్రముఖులు మొత్తం ప్రస్తుతం ఒకే విషయం గురించి స్పందిస్తున్నారు.చనిపోయిన తండ్రి కొడుకుల ఆత్మ శాంతించేలా బాధ్యులను కఠినంగా శిక్షించాలి అనేది సినీ ప్రముఖుల డిమాండ్‌.

 Cinima Filed Workers Support To Tamilanadu Jayaraju And Finix, Tamilanadu, Jayar-TeluguStop.com

ఒక చిన్న షాప్‌ను నిర్వహించే జయరాజ్‌, పినిక్స్‌ లను పోలీసులు అత్యంత దారుణంగా హింసించి చంపేశారు అనేది విమర్శ.లాక్‌ డౌన్‌లో ప్రభుత్వం చెప్పిన సమయంకు కాకుండా ఆలస్యంగా షాప్‌ మూసినందుకు గాను ఆ తండ్రి కొడుకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఒక సాదారణ విషయంలో వారిద్దరిని అరెస్ట్‌ చేసిన పోలీసులు ఏవో కారణాల వల్ల వారిని అత్యంత దారుణంగా కొట్టారట.వారిద్దరు కూడా లాకప్‌లోనే మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

ఉన్నతాధికారులు ఈ విషయమై విచారణకు ఆదేశించినా కూడా లాకప్‌ డెత్‌కు పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే ఆ తండ్రి కొడుకులను న్యాయం చేయాల్సిందే అంటూ తమిళ సినీ జనాలు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు.

Telugu Finix, Jayaraju, Tamil Cinima, Tamilanadu, Telugucinima-Movie

కోలీవుడ్‌కు చెందిన పలువురు హీరోలు మరియు హీరోయిన్స్‌ ప్రస్తుతం ఈ విషయంపై స్పందించేందుకు ముందుకు వస్తున్నారు.అమెరికాలో నల్ల జాతీయులను చంపేస్తే ఇక్కడ కూడా స్పందించారు.కాని ఇక్కడ తండ్రి కొడుకులను చంపేస్తే సెలబ్రెటీలు స్పందించరా అంటూ సామాన్య జనాలు ప్రశ్నించడంతో ఈ విషయమై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.

తమిళనాడు ప్రభుత్వం ప్రస్తుతం ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తెలుగు సినీ ప్రముఖులు కూడా జయరాజ్‌, పినిక్స్‌ల లాకప్‌ డెత్‌పై విచారం వ్యక్తం చేస్తు సోషల్‌ మీడియాలో స్పందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube