సిఎం స్టాలిన్.. నెరవేరుస్తున్న ఐదు ఎన్నికల వాగ్దానాలు..!

తమిళనాడులో ఎం.కె స్టాలిన్ శకం మొదలైంది.దశాబ్ధ కాలం తర్వాత తమిళనాడులో డి.ఎం.కే పాలన నిర్వహిస్తుంది.ఇటీవల జరిగిన తమిళనాడు ఎలక్షన్స్ లో డి.ఎం.కె ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.నేడు రాజ్ భవన్ లో గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ అధ్యక్షతన తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు ఎం.కే.స్టాలిన్.సిఎం గా అలా ప్రమాణస్వీకారం చేశారో లేదో వెంటనే ఐదు ఎన్నికల వాగ్దానాలు నెరవేరుస్తూ ఆయా ఫైల్స్ మీద సైన్ చేశారు.

 Tamilanadu Cm Mk Stalin Signed 5 Orders Dmk Manifesto , 5 Orders,cm, Dmk Manifes-TeluguStop.com

డి.ఎం.కే ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఐదిటిని సిఎంగా ప్రమాణస్వీరాం చేశారో లేదో వాటిని అమలు చేస్తున్నారు తమిళనాడు సిఎం ఎం.కే స్టాలిన్.

ఇంతకీ స్టాలిన్ సైన్ చేసిన ఆ ఐదు అంశాలు ఏంటి అంటే.కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని రేషన్ కార్డు దారులకు 4000 రూపాయల ఆర్ధిక సాయం అందిస్తున్నారు.

మే నెలలో 2 వేలు.మిగిలినవి తర్వాత పంపిణీ చేస్తారని తెలుస్తుంది.అంతేకాదు పాల ధరను 3 రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు.విద్యార్ధులతో సహా మహిళందరికి ప్రభుత్వ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కలిగిస్తున్నారు.

దీని వలన రాష్ట్ర ప్రభుత్వానికి 1200 కోట్ల రూపాయల అదనలు భారం అని తెలుస్తుంది.ఏ ఫిర్యాదునైనా సరే డి.ఎం.కే ప్రభుత్వం 100 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు.ప్రైవేట్ హాస్పిటల్ లో కరోనా చికిత్సల కోసం అయ్యే కర్చు సిఎం ఆరోగ్య భీమా పధకం లోకి వస్తాయని చెప్పారు.ప్రభుత్వ హాస్పిటల్స్ కు ఆ సొమ్ము తిరిగి చెల్లిస్తారని తెలుస్తుంది.

మొత్తానికి సిఎంగా అలా ప్రమాణస్వీకారం చేశారో లేదో స్టాలిన్ తన మార్క్ పాలన షురూ చేశారని తమిళనాడు ప్రజలు అనుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube