అయ్యో పాపం బన్నీ హీరోయిన్‌కు చిత్రమైన జబ్బు, ఆ జబ్బుతో పెళ్లి వద్దనుకుంటుందట!  

Tamila Actress Ketharin Suffer From Anosmiya-ketharin,ketharin Suffer In Anosmiya,telugu And Tamila Actress

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్‌ కేథరిన్‌ తెర్సా.ఈ అమ్మడు టాలీవుడ్‌ లో పలు చిత్రాలను చేసింది.ప్రస్తుతం తమిళం, కన్నడంతో పాటు తెలుగులో కూడా అడపా దడపా చేస్తూనే ఉంది.అల్లు అర్జున్‌తో ఎక్కువగా కనిపించిన ఈ అమ్మడు తాజాగా ఒక విషాదకరమైన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది.

Tamila Actress Ketharin Suffer From Anosmiya-ketharin,ketharin Suffer In Anosmiya,telugu And Tamila Actress-Tamila Actress Ketharin Suffer From Anosmiya-Ketharin Ketharin In Anosmiya Telugu And

తనకు చిన్నప్పటి నుండి ఒక వ్యాది ఉందని, ఆ వ్యాది కారణంగా తాను జీవితంలో చాలా మిస్‌ అవుతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Tamila Actress Ketharin Suffer From Anosmiya-ketharin,ketharin Suffer In Anosmiya,telugu And Tamila Actress-Tamila Actress Ketharin Suffer From Anosmiya-Ketharin Ketharin In Anosmiya Telugu And

పూర్తి వివరాల్లోకి వెళ్తే.కేథరిన్‌ తెర్సా అనోస్మియ అనే వింత జబ్బుతో బాధపడుతుందట.ఈ జబ్బు లక్షణం చాలా విభిన్నంగా ఉంటుంది.ఏంటీ అంటే ఈ జబ్బు ఉన్న వారు వాసన చూడలేరు.ముక్కు ఉన్నది కేలం అలంకారంకు మాత్రమే.కేవలం వారు గాలి మాత్రమే పీల్చుకోగలరు కాని అది ఏం స్మెల్‌ అనే విషయాన్ని గుర్తించలేరు.

మంచి స్మెల్‌, బ్యాడ్‌ స్మెల్‌లను వారు గుర్తించలేక పోవడంతో పాటు, అన్నింటిని కూడా ఒకేలా పీల్చుకుంటారు.అలా చేయడం వల్ల కొన్ని సార్లు అనారోగ్య పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది.

లక్షల్లో కేవలం ఒక్కరు ఇద్దరికి మాత్రమే వచ్చే ఈ జబ్బు కేథరిన్‌ తెర్సాకు వచ్చింది.ఈ జబ్బు కారణంగా ప్రాణాలకు ప్రమాదం అయితే లేదు.కాని జీవితంలో తాను ఎన్నో సువాసనలను మిస్‌ అవుతున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది.ఈ వింత పరిస్థితి కారణంగా నేను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా చేయడం లేదని, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అంటూ సంచల వ్యాఖ్యలు చేసింది.

ఈమె చేస్తున్న ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆమె సన్నిహితులకు బాధ కలిగించాయి.త్వరలో ఈమె విజయ్‌ దేవరకొండ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.