తెలుగులో ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో అన్నదమ్ములుగా టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ మరియు ప్రిన్స్ మహేష్ బాబు నటించగా అక్కినేని సమంత మరియు తెలుగు అమ్మాయి అంజలి హీరోయిన్లుగా నటించారు.
అలాగే నటుడు రావు రమేష్, తనికెళ్ల భరణి, ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, రవి బాబు, పృథ్వి, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు ఈ చిత్రంలో నటించడంతో కలెక్షన్ల సునామీ కురిసింది.
ఇందులోభాగంగా దాదాపుగా ఆంధ్ర, నైజాం, సీడెడ్, ప్రాంతాల్లో 50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు నమోదయ్యాయి.
అయితే ఈ చిత్రంలో హీరోల తండ్రి రేలంగి మావయ్య పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ పాత్ర సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
అలాగే ఈ పాత్ర కి ప్రకాష్ రాజ్ తన నటనతో వందకి వంద శాతం న్యాయం చేశాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే ముందుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకాష్ రాజు పాత్రలో సౌత్ సూపర్ స్టార్ “రజనీ కాంత్” ని నటింపజేయాలని అనుకున్నారట.
కానీ పలు అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాకపోవడంతో ఆ ఆవకాశం ప్రకాష్ రాజ్ కి దక్కిందట.ఒకవేళ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో రజనీ కాంత్ హీరోల తండ్రి పాత్రలో నటించి ఉంటే సౌతిండియాలోని ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యేదని కొందరు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రకాష్ రాజ్ తెలుగు, తమిళం, కన్నడ, తదితర భాషలలో కలిపి దాదాపుగా 8 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.ఇందులో కేజిఎఫ్ చాప్టర్ 2, పుష్ప, పొన్నియన్ సెల్వన్, సర్కారీ వారి పాట వంటి భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి.కాగా ఇటీవలే ప్రకాష్ రాజ్ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “వకీల్ సాబ్” చిత్రంలో కూడా లాయర్ పాత్రలో నటించి ప్రేక్షకులని బాగానే అలరించాడు.