తమిళ స్టార్‌ వినూత్న ప్రచారం.. చూసి నేర్చుకోండి బ్రదర్స్‌

దేశ వ్యాప్తంగా కరోనా నేపథ్యం లో సినీ ప్రముఖులు తమకు తోచిన విధంగా మాస్క్‌ లు పెట్టుకోండి అంటూ కొందరు.కొందరు తమకు తోచిన విధంగా సలహాలు సూచనలు ఇస్తున్నారు.

 Tamil Starts Viral Video With Mask Massage , Flim News, Tamil Stars, Tollywood H-TeluguStop.com

కొందరు ఒక అడుగు ముందుకు వేసి కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ వీడియోల రూపంలో మెసేజ్ లను ఇస్తున్నారు.ఇలాంటి సమయంలో తమిళ సినిమా ఇండస్ట్రీ కి చెందిన పలువురు స్టార్స్‌ ఒక చిన్న డాక్యుమెంటరీ తరహా వీడియోను చేశారు.

అందులో మాస్క్‌ లను ఎలా పెట్టుకోవద్దో చెప్పే ప్రయత్నం చేశారు.కొందరు మాస్క్‌ లు గొంతుకు నోరుకు లేదంటే కళ్లకు రకరకాలుగా పెట్టుకుంటున్నారు.

అలాంటి వారికి అవగాహన కల్పించేందుకు అన్నట్లుగా ఈ వీడియోను వారు చేయడం జరిగింది.మాస్క్‌ అనేది సరిగ్గా పెట్టుకుంటేనే కరోనా నుండి రక్షణ అంటూ వారు చెప్పే ప్రయత్నం చేశారు.

Telugu Tamil Stars, Tollywood Heros, Tollywood-Movie

వరలక్ష్మి మొదలుకుని పలువురు యంగ్‌ హీరో లు కమెడియన్స్ ఇలా అంతా కూడా సరదాగా ఈ వీడియోను చేసి అందరికి షేర్‌ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.ప్రతి ఒక్క తమిళ సెలబ్రెటీ కూడా ఈ వీడియో ను షేర్‌ చేస్తూ అందరి దృష్టి ని ఆకర్షిస్తున్నారు.మాస్క్ లు ఖచ్చితంగా సరిగ్గా పెట్టుకోవాలంటూ సూచించే ఆ మెసేజ్ కు విమర్శకుల ప్రశంసలు దక్కుతుంది.

ఈ సమయంలోనే మన టాలీవుడ్‌ స్టార్‌ హీరోల ను మరియు సెలబ్రెటీలను కొందరు ట్రోల్‌ చేస్తున్నారు.వారిని చూసి అయినా నేర్చుకోవచ్చు కదా అంటున్నారు.ఎంతో మంది క్రియేటివిటీ తో సినిమా లు చేస్తారు.కాని ఈ సమయం లో జనాలకు చేరువయ్యే లా ఒక మంచి మెసేజ్‌ ను మాత్రం తీయడం లో ఎందుకు విఫలం అవుతున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube