ఎట్టకేలకు స్టార్ దర్శకుడి తదుపరి సినిమా పట్టాలెక్కబోతుంది

తమిళం తో పాటు తెలుగులో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు మురుగదాస్.

ఆయన బాలీవుడ్ లో కూడా మంచి సినిమాలను తెరకెక్కించి 100 కోట్లకు పైగా వసూళ్ల ను దక్కించుకున్న ఘనత సొంతం చేసుకున్నాడు.

అలాంటి మురగదాస్ ఈ మధ్య కాలంలో సినిమాలు లేక బిత్తర చూపులు చూస్తున్నాడు అంటూ తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఆ మధ్య రజనీకాంత్ తో తెరకెక్కించిన సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడింది.

దాంతో మురగదాస్ కెరియర్ సందిగ్దంలో పడ్డట్లు అయింది.ఈ సమయం లో మురుగదాస్ తో సినిమాను చేసేందుకు తమిళ స్టార్ హీరో సూర్య ముందుకొచ్చాడు అని తెలుస్తుంది.

మురగదాస్‌ తో ఏ ఒక్క హీరో కూడా సినిమా ను చేసేందుకు ముందుకు రాని ఈ సమయం లో సూర్య తాను చేసేందుకు రెడీ అంటూ డేట్లు కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.మురగదాస్ దర్శకత్వం లో ఇప్పటి వరకు చేసిన పలువురు హీరోలు స్టార్ లోగా ఎదిగిన విషయం తెలిసిందే.గతంలో మురగదాస్ దర్శకత్వంలోనే సూర్య గజిని సినిమా ను చేసి సూపర్ హిట్ ని దక్కించుకున్నాడు.

Advertisement

మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది.ఈ నేపథ్యంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చ కార్యక్రమాలు జరుగుతున్నాయని సూర్య ప్రస్తుతానికి కమిట్‌ అయిన సినిమాలన్నింటి షూటింగ్స్ ని చక చక పూర్తి చేసి వచ్చే సంవత్సరం ఆరంభంలోనే మురుగదాస్ కి డేట్లు ఇచ్చేందుకు ఓకే చేశాడని సమాచారం అందుతుంది.సూర్య మరియు మురగదాస్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా మరో గజినీ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు, మరి ఆ స్థాయిలో ఈ సినిమా ఉంటుందని చూడాలి.

అది ఇది కాకుండా గజిని సీక్వెల్ తీస్తే ఇంకా బాగుంటుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు