ఎన్టీఆర్ టెంపర్ తన సినిమా రీమేక్ అంటున్న తమిళ హీరో!  

టెంపర్ మూవీ తన సినిమా కాపీ అంటున్న తమిళ నటుడు. .

Tamil Star Artist Said Temper Movie Is A Copy-

పూరీ జగన్నాథ్ దర్శకత్వం, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన చిత్రం టెంపర్. ఈ సినిమా తెలుగు నాట ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. వక్కంత వంశీ కథ అందించిన ఈ సినిమాలో ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఎలిమెంట్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచి టెంపర్ మూవీని బ్లాక్ బస్టర్ గా మార్చింది..

ఎన్టీఆర్ టెంపర్ తన సినిమా రీమేక్ అంటున్న తమిళ హీరో!-Tamil Star Artist Said Temper Movie Is A Copy

ఇదిలా ఉంటే ఈ సినిమాని బాలీవుడ్ లో రణవీర్ సింగ్ సింబ క్రింద రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ కొట్టాడు. ఇక తమిళంలో విశాల్ హీరోగా అయోగ్య పేరుతో రీమేక్ అయ్యి రిలీజ్ కి సిద్ధంగా ఉంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా తన సినిమా కాపీ అంటూ పాతతరం హీరో తెరముందుకి వచ్చాడు.

అతను తమిళ అయోగ్య చిత్రంలో విలన్ గా కూడా నటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమిళంలో పలు సినిమాలో హీరోగా నటించిన పార్తిపన్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు టెంపర్ రీమేక్ అయోగ్యలో విలన్ పాత్రలో కనిపిస్తుంది ఈ నటుడే.

అయితే తాజాగా టెంపర్ మూవీ తన సినిమా ఉల్లే వేలియే సినిమా కాపీ అని చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి పార్తిపన్ వాఖ్యలపై దర్శకుడు పూరీ, రచయిత వక్కంత వంశీ ఇప్పుడు ఎలా స్పందిస్తాడు అనేది వేచి చూడాలి.