ఓటీటీ బాట పట్టిన అరవ అర్జున్ రెడ్డి

టాలీవుడ్‌లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కిన అర్జున్ రెడ్డి చిత్రం బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ సినిమాతో టాలీవుడ్‌ను ఎలా రఫ్ఫాడించాడో మనం చూశాం.

 Tamil Remake Of Arjun Reddy To Release On Ott, Arjun Reddy, Ott, Tamil Remake, B-TeluguStop.com

బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.ఇక ఈ సినిమా రికార్డు స్థాయిలో సక్సె్స్ కావడంతో ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా రీమేక్ చేశారు.

ఇప్పటికే బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’ పేరుతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

కాగా అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళంలో ‘వర్మ’ పేరుతో తెరకెక్కించారు.

అయితే తమిళంలో ఈ సినిమాను రెండు వర్షన్‌లలో తెరకెక్కించారు.ఇప్పటికే కొత్త డైరెక్టర్ గిరీశయ్య డైరెక్షన్‌లో తెరకెక్కించిన ‘ఆదిత్య వర్మ’ చిత్రం రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.

కాగా మరో దర్శకుడు బాల తెరకెక్కించిన ‘వర్మ’ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.తమిళ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ ఈ సినిమాతో కోలీవుడ్‌లో హీరోగా పరిచయం అవుతున్నాడు.

కాగా ఈ సినిమాలో బెంగాలీ ముద్దుగుమ్మ మేఘ హీరోయిన్‌గా నటిస్తోంది.

తెలుగు, హిందీ భాషల్లో దుమ్ములేపిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు ఎంతమేర ఆదరిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక బోల్డ్ కంటెంట్‌తో వస్తోన్న ఈ సినిమాను అక్టోబర్ 6న సింప్లీ సౌత్ యాప్‌లో ప్రీమియర్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.కాగా విక్రమ్ లాంటి స్టార్ హీరో కొడుకు తొలి సినిమాతో సక్సెస్ కొడతాడా లేడా అనేది మాత్రం సస్పెన్స్‌గానే మిగిలింది.

ఏదేమైనా నార్త్, సౌత్‌లో దుమ్ములేపిన అర్జున్ రెడ్డి చిత్ర తమిళ వర్షన్ ఇలా ఓటీటీలో రిలీజ్ అవుతుండటంతో అర్జున్ రెడ్డి కల్ట్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube