శింబుని బ్యాన్ చేసిన నిర్మాతల మండలి

కోలీవుడ్ లో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు శింబు.కెరియర్ ఆరంభంలో వరుస సినిమాలు, హిట్స్ తో మంచి స్పీడ్ చూపించిన శింబు తరువాత సినిమాల కంటే బయట అనవసరమైన వ్యాపకాలు ఎక్కువ కావడంతో కొంత వరకు గాడి తప్పాడు.

 Tamil Producers Council To Ban On Actor Simbu, Tollywood, Kollywood, Eswaran Mov-TeluguStop.com

అతని తరువాత హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి లాంటి వారు స్టార్ హీరోలు అయిపోయారు.అయితే శింబు మాత్రం ఇప్పటికే మినిమమ్ రేంజ్ బడ్జెట్ హీరోగానే ఉన్నాడు.

కొంత మంది నిర్మాతలు అయితే అతనితో సినిమాలు చేయడానికి కూడా భయపడతారు.దీనికి కారణం కూడా అది.ఒక సినిమా ఒప్పుకున్నా తర్వాత సినిమా షూటింగ్ విషయంలో శింబు చాలా నిర్లక్ష్యంగా ఉంటాడనే అభిప్రాయం ఉంది.తాజాగా శింబు హీరోగా తెరకెక్కిన ఈశ్వరన్ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

అయితే ఈ సినిమా అనుకున్నంత హిట్ కాలేదు.ఏవరేజ్ మూవీగా మిగిలిపోయింది.

ఇక తాజాగా కోలీవుడ్ నిర్మాతల మండలి శింబుపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

Telugu Simbu, Eswaran, Kollywood, Tamilproducers, Tollywood-Movie

దీనికి బలమైన కారణం కూడా ఉంది.శింబు నటించిన అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ సినిమా వివాదం ఇప్పటికీ అతన్ని వదలడం లేదు.మైఖేల్‌ రాయప్పన్ అనే నిర్మాత నాలుగేళ్ల కింద అన్బానవన్‌ అరసాదవన్‌ అడంగాదవన్‌’ అనే చిత్రాన్ని మొదలుపెట్టాడు.

అయితే ఈ సినిమాకు మధ్యలోనే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి.దాంతో అత్యంత కష్టం మీద సినిమాను విడుదల చేసాడు.

కానీ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.ఈ సినిమా ఫ్లాప్ తర్వాత నిర్మాత రివర్స్ అయ్యాడు.

ప్రమోషన్ సమయంలో, సెట్స్ పై ఉన్నపుడు కూడా శింబు ఈ సినిమాకు ఏ మాత్రం సహకరించలేదని, తనను చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడని నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర ఆరోపణలు చేశాడు.ఈ విషయమై తమిళ నిర్మాతల మండలి జోక్యం చేసుకుని రాయప్పన్, శింబు మధ్య రాజీ కుదిర్చింది.రాయప్పన్‌కు ఒక సినిమాను ఉచితంగా చేయడం లేదంటే, ఆయనకు సినిమా కోసం తీసుకున్న 6.6 కోట్ల మొత్తాన్ని మూడు విడతలుగా చెల్లించేలా ఇద్దరికి ఒప్పందం కుదిరింది.శింబు రాయప్పన్‌కు సినిమా చేయలేదు.అలాగని తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వలేదు.ఈ విషయమై మైఖేల్‌ రాయప్పన్‌ తిరిగి నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు.దీనిపై సీరియస్‌ అయిన నిర్మాతల మండలి శింబు భవిష్యత్తులో నటించే చిత్రాలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించరాదని తీర్మానించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube