పారాసైట్ తమిళ సినిమాకి కాపీ అంట! కేసు వేస్తా అంటున్న నిర్మాత  

Tamil Producer To Sue Makers Of Oscar-winning Film Parasite - Telugu Hollywood, Kollywood, Makers Of Oscar-winning Film Parasite, Tamil Producer To Sue

హాలీవుడ్ లో తెరకేక్కే సినిమాలని కాపీ చేసి, లేదంటే అదే స్టొరీ లైన్ తీసుకొని మన నేటివిటీకి తగ్గట్లు మార్చుకొని సినిమాలు తీయడం ఇండియాలో సాధారణంగా జరుగుతూనే ఉంటుంది.ముఖ్యంగా సౌత్ లో తెరకెక్కిన చాలా సినిమాలలో హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో తీసినవి ఉన్నాయి.

Tamil Producer To Sue Makers Of Oscar-winning Film Parasite - Telugu Hollywood Kollywood Oscar-winning

అయితే ఈ మధ్య కాలంలో సినిమా బోర్డర్స్ బ్రేక్ అయిపోయాయి.ఇండియన్ సినిమాలు కూడా హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతూ ఉన్నాయి.

దీంతో ఇండియాలో ఎవరైనా హాలీవుడ్ కథలని కాపీ చేస్తే వెంటనే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు.అజ్నాతవాసి, సాహో సినిమాల విషయంలో అదే జరిగింది.

ఇక బాలీవుడ్ సినిమాల విషయం కూడా జరిగింది.

ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఆస్కార్ సినీ ఉత్సవాలాలో పారాసైట్ అనే ఒక కొరియన్ మూవీ ఏకంగా మూడు ఆస్కార్ లు గెలుచుకుంది.

అయితే ఈ సినిమా ఒక తమిళ సినిమాకి కాపీ అనే టాక్ వినిపించింది.దీనిపై ఆ సినిమా నిర్మాత పీఎల్ థెనప్పన్ తాజాగా రియాక్ట్ అయ్యాడు.విజయ్, రంభ హీరో హీరోయిన్లుగా 1999లో తాను నిర్మించిన రొమాంటిక్ కామెడీ సినిమా మిన్సారా కన్నాను కాపీ కొట్టి పారాసైట్ సినిమా తీశారని ఆరోపించారు.పారాసైట్ సినిమా నిర్మాతలపై దావా వేస్తానని థెనప్పన్ బాంబు పేల్చారు.

ఇంటర్నేషనల్ లాయర్ సాయంతో పారాసైట్ నిర్మాతలపై కేసు వేస్తానని చెప్పాడు.వాళ్ల సినిమాలను ఇన్ స్పిరేషన్ గా తీసుకుని మేం సినిమాలు చేస్తే కేసులు వేస్తున్నారు కదా.ఇప్పుడు వాళ్లు కూడా నా సినిమాను కాపీ కొట్టారు.కాబట్టి నేను కూడా కేసు వేయడం న్యాయమే అని చెబుతున్నారు.

ఇక మిన్సారా కన్నాను డైరెక్ట్​ చేసిన కేఎస్ రవికుమార్ కూడా దీనిపై స్పందించారు.నా కథకు ఇంటర్నేషనల్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు.

అయితే కాపీరైట్స్ కేసు వేయడం అనేది నిర్మాత ఛాయస్ అని చెప్పారు.

తాజా వార్తలు

Tamil Producer To Sue Makers Of Oscar-winning Film Parasite-kollywood,makers Of Oscar-winning Film Parasite,tamil Producer To Sue Related....