జల్లికట్టు కథ రోజుకో మలుపు తిరుగుతోంది.చిన్నగా మొదలై, త్రిష వివాదంతో వార్తల్లోకి బలంగా వెళ్ళి, మొదట శాంతియుతంగా అనుకున్నది సాధించుకున్న నిరసనలు, ఆ తరువార హింసాత్మక రూపం దాల్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు కొత్తగా మరో వివాదస్పదమైన వాదనతో జల్లికట్టుకి మకిలి పట్టింది.
విషయం ఏమిటంటే, కొందరు జల్లికట్టు మద్దతుదారులు తమిళ సినిమా నుంచి త్రిష, తమన్నా, కాజల్ లని గెంటేయాలని, వారిని ఇండస్ట్రీలోకి తిరిగి రాకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
పాపం ఈ హీరోయిన్లు ఏం చేసారు అనే కదా మీ డౌటు .
త్రిష PETA అనే జంతుసంరక్షణ సంస్థకి ప్రచారకర్త అన్న సంగతి తెలిసిందే.దీనికి కాజల్, తమన్నా కూడా ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు.జల్లికట్టు మీద ఇంత రాద్ధాంతం జరగడానికి పెటానే కారణం కదా.అందుకే పెటాతో పాటు పెటాని సపోర్ట్ చేసేవారందరిని తమిళనాడు నుంచి తరిమేయాలని, సినిమా తారలని కూడా వదలకూడదని కొన్ని తమిళ సంఘాలు నినదిస్తున్నాయి.