ఆఖరికి అనుకున్నది సాధించారు... ఆ అమ్మాయిలు పెళ్లితో ఒక్కటయ్యారు!

వినడానికి విడ్డూరంగా వుంది కదూ.కానీ ఈరోజు, రేపు ఇలాంటివి చాలా కామన్ అయిపోయాయి.

 Tamil Nadu Woman Married Bangladeshi Girl Viral Details, Love, Viral Latest, New-TeluguStop.com

నేటి తరం వింత పోకడలకు పోతోంది.వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు పెద్దలు.

అయితే అలాంటి మాటలు నేడు యువత పెడచెవిన పెడుతున్నారు.లేకపోతీ ఇదేంటి! మనం ఖండాతరాల ప్రేమను చూసాము.

ఇంటర్ కేస్ట్ మ్యారేజెస్ చూస్తూ వున్నాం.కానీ ఇదెక్కడి యవ్వారం! వారిది ఒక దేశం కాదు, ఆడ, మగ విషయమే లేదు ఇక్కడ.అవును… రెండు దేశాల యువతులు ప్రేమించుకొని ఒక్కటైన అరుదైన ఘటన తాజాగా చోటు చేసుకొంది.

ఇటీవల ఇలాంటి వివాహాల జోరు ఎక్కువైంది.

వారు పెళ్లాడేందుకు తల్లిదండ్రులతో పోరాడి, వారిని ఒప్పించి మరీ ఒక్కటైయారు.తాజాగా తమిళనాడుకు చెందిన ఓ యువతి, బంగ్లాదేశ్‌లోని హిందూ కుటుంబానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంది.

తమిళనాడు సంప్రదాయ బ్రాహ్మణ వివాహ పద్ధతిలో గత నెల 31న జరిగిన ఈ పెళ్లి విషయం తాజాగా వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే, తమిళనాడులోని మదురైకి చెందిన సుబ్రమణి కుటుంబం కెనడాలోని కల్గరీలో స్థిరపడింది.

ఆయన కుమార్తె సుభిక్ష సుబ్రమణికి బంగ్లాదేశ్ హిందూ కుటుంబానికి చెందిన టీనా దాస్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది.

Telugu Bangladeshi, Groom, Love, Married, Subhiksha, Tamil Nadu, Tina Das, Lates

కాగా 19 ఏళ్ల వయసున్నప్పుడే సుభిక్ష ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.టీనాను పెళ్లాడతానని వారికి ఖరాఖండిగా స్పష్టం చేసింది.అందుకు వారు మొదట అంగీకరించలేదు.

చివరికి ఆరేళ్ల పోరాటం తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో చెన్నైలో గత నెల 31న వీరి వివాహం జరిగింది.తమిళ బ్రాహ్మణ పద్ధతిలో సుభిక్ష, టీనా దాస్ ఇద్దరూ తమ తండ్రుల ఒడిలో కూర్చున్నారు.

ఆ తర్వాత దండలు మార్చుకున్నారు.పెళ్లి చేసుకోవాలన్నది తమ కల అని, నెరవేరుతుందని తాము అనుకోలేదని సుభిక్ష, టీనాలు చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube