ఈ మేడమ్‌ ఉపాధ్యాయ వృత్తికే కలంకం... తన స్టూడెంట్స్‌తో అలా వాడుకున్న టీచర్‌

ఈ సమాజంలో టీజర్‌ వృతి అంటే అత్యంత పవిత్రమైనదిగా, ఉన్నతమైనదిగా భావిస్తాం.ముఖ్యంగా అత్యంత సాంప్రదాయ బద్దమైన మన దేశంలో ఉపాద్యా వృతి అనేది దైవంతో సమానం.

 Tamil Nadu Teacher Held For Assaulting Her Male Students-TeluguStop.com

అందుకే తల్లిదండ్రుల తర్వాత గురువును కూడా ఇండియాలో దైవంగా పూజిస్తాం.కాని కొందరు గురువులు అత్యంత నీచంగా ప్రవర్తిస్తూ ఉపాధ్యా వృత్తికే కలంకంగా నిలుస్తున్నారు.

నీచమైన పద్దతులతో కొందరు చేస్తున్న పనులతో ఉపాద్యాయ వృత్తి అంటేనే గౌరవం పోయే పరిస్థితి ఏర్పడింది.అయితే పురుషులు మాత్రమే ఇప్పటి వరకు నీచమైన గురువులుగా పేరు తెచ్చుకున్నారు.

మొదటి సారి ఒక లేడీ టీచర్‌ ఉపాధ్యాయ వృత్తికి కలంకం తీసుకు వచ్చింది.తమిళనాడుకు చెందిన ఈ పంతులమ్మ ప్రస్తుతం కటకటాల్లో ఉంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే…

చెన్నైలోని తిరువన్నమలైకి చెందిన ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ఆ స్కూల్‌కు చెందిన 10వ తరగతి కుర్రాళ్లకు వల వేసి, తన కోరిక తీర్చుకుంటూ ఉందట.ఆ విషయాన్ని ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది.

తాజాగా ఆమె భర్తకు ఆమె మొబైల్‌ ఫోన్‌లో కొన్ని అశ్లీల ఫొటోలు మరియు ఛాటింగ్‌ కనిపించింది.దాంతో ఆరా తీయగా వారు ఆమె పని చేస్తున్న స్కూల్‌లో 10వ తరగతి పిల్లలు అని తెలిసింది.

వెంటనే తన భార్య విషయం, ఆమె చేస్తున్న పనిపై అతడికి క్లారిటీ వచ్చేసింది.వెంటనే ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, ఫోన్‌ను పోలీసులకు ఇచ్చాడు.

ఎంక్వౌరీ చేసిన పోలీసులు వెంటనే స్కూల్‌ పిల్లలను విచారించగా మేడం తమను లైంగికంగా లోబర్చుకునేందుకు ప్రయత్నించిందని కొందరు విద్యార్థులు చెప్పడం జరిగింది.ఆమె తమకు ఫొటోలు, వీడియోలు పంపేది అంటూ చెప్పుకొచ్చారట.దాంతో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు.ఇక్కడ ట్విస్ట్‌ ఏంటీ అంటే ఆమె అంతకు ముందు వర్క్‌ చేస్తున్న స్కూల్‌లో ఆమె ప్రవర్తన బాగుండటం లేదని సస్పెండ్‌ చేశారు.

అయినా కూడా ఆమె బుద్ది మారలేదు.అందుకే ఆమెను ఉద్యోగం నుండి డిస్మిస్‌ చేసి జైల్లో పెట్టాలని అంటున్నారు.ఇంత నీచమైన ఉపాధ్యాయురాలు దేశంలోనే ఉండదు అని విమర్శళు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube