గాల్లో కలవాల్సిన ప్రాణం.. ఆర్పీఎఫ్ పుణ్యమా అని రైళ్లోకి

రైలు ఎక్కి దిగేటప్పుడు జాగ్రత్త అని మైకులో చెవులు బద్దలయ్యేలా మోగుతూ ఉన్నా పట్టించుకున్నవారే లేరు.తమిళనాడులో జరిగిన తాజా ఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది.

 Tamil Nadu Railway Cop Saves Man Life-TeluguStop.com

రైలు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఎంత మొత్తుకున్నా రైల్వేవారి మాట వినకపోతే ఏం జరుగుతుందో ఈ ఘటన తెలిపింది.

తమిళనాడులోని కోయంబత్తూర్‌ రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు.

దీంతో అతడు అదుపు తప్పి రైలుకు, ప్లాట్‌ఫాంకు మధ్యలో పడిపోబోయాడు.ఇది అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ పోలీస్ గార్డు గమనించి అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆ యువకుడు బతికి బట్టకట్టాడు.

అతడిని కింద పడకుండా పరిగెత్తి రైలులోకి బలంగా నెట్టేయడంతో అతడు రైలులోకి వెళ్లి పడ్డాడు.

Telugu Railway Cop, Railway Force, Railways, Tamil Nadu-

ఇది చూసిన స్థానిక ప్రయాణికులు ఆ ఆర్పీఎఫ్ పోలీస్ గార్డును అభినందించారు.అతడి సమయస్ఫూర్తికి వారంతా సెల్యూట్ కొడుతున్నారు.రైల్వే అధికారుల ఎల్లవేళలా ప్రయాణికుల సంరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆ గార్డు అన్నాడు.

ఏదేమైనా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube