ప్రేమతో పెంచుకున్న ఎద్దు చనిపోవడంతో... ఆ రైతు ఏం చేసాడంటే...?!

ఎవరికైనా సరే వారితో పాటు ప్రతిరోజు కలిసి మాట్లాడే వారు, కలిసి జీవించేవారు సడన్ గా ఈ లోకాన్ని వదిలి వెళితే ఆ బాధ వర్ణనాతీతం.వారు ఈ ప్రపంచాన్ని వదిలి పెట్టిన కూడా మనం ఏ పని చేసిన వారు మనకు కచ్చితంగా పక్కనే ఉన్నట్లు గుర్తుకొస్తుంటారు.

 Tamil Nadu Farmer Built Statue For Bull, Bull, Death, Viral Photos, Jallikattu B-TeluguStop.com

ఇలాంటి విషయాలు కేవలం మనుషులు మనుషుల్ని కోల్పోతూనే మాత్రమే కాకుండా.వారితో పాటు నిత్యం జీవనం కొనసాగించే జంతువులు కూడా దూరం అయినప్పుడు ఇలాంటి అనుభూతినే పొందుతారు.

ఇలాంటి ఈ సంఘటన ఒకటి తాజాగా తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

తమిళనాడు రాష్ట్రంలోని తిరుప్పూర్‌ జిల్లా పాపంపాళయం పనకాట్టుతోట ప్రాంతానికి చెందిన చెల్లముత్తు తన తోటలో గాంగేయం జాతి ఎద్దును 10 సంవత్సరాలుగా ఓ రైతు అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు.

అయితే 2 సంవత్సరాల క్రితం ఆ ఎద్దు అనారోగ్యంతో మృతి చెందింది.ఇక అప్పటి నుండి ఆ ఎద్దుకు జ్ఞాపకార్ధంగా ఏదో ఒకటి చేయాలని సదరు రైతు నిర్ణయించుకున్నాడు.

ఇక చివరిగా ఆయన తన ఎద్దు జ్ఞాపకార్థంగా ఓ స్మారక మందిరం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.దీనితోనే తన తోటలోని ఓ ప్రాంతంలో మండపంని ఏర్పాటు చేసి అందులో ఆ ఎద్దు ఆకృతి కలిగి ఉన్నపెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు.

ఇందుకు సంబంధించి సదరు రైతు చెల్లముత్తు మాట్లాడుతూ… ఎద్దు 4 లేగదూడలకు జన్మ ఇచ్చిందని, కుటుంబంలో సభ్యుల లాగే ఎద్దు కూడా మాలో ఒకరిగా పెరిగిందని, అయితే ఎద్దు అనారోగ్యం తో మృతిచెందడంతో ఎద్దు స్మారకార్థం కోసం ఒక స్మారక మందిరాన్ని నిర్మించినట్లు అతడు తెలియజేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube