సుప్రీంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఎదురుదెబ్బ

తమిళనాడు సీఎం స్టాలిన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ ర్యాలీలు నిర్వహించుకునేందుకు ధర్మాసనం అనుమతిని ఇచ్చింది.

గాంధీ జయంతితో పాటు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ర్యాలీలు నిర్వహించుకునేందుకు అనుమతిని ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ కోరగా స్టాలిన్ సర్కార్ నిరాకరించింది.ఈ నేపథ్యంలో గత నవంబర్ లో ఆర్ఎస్ఎస్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.

దీంతో కొన్ని షరతులతో ర్యాలీలకు అనుమతి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది కోర్టు.కానీ మద్రాసు హైకోర్టు తీర్పును స్టాలిన్ సర్కార్ సుప్రీంలో సవాల్ చేసిన విషయం తెలిసిందే.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం హైకోర్టును సమర్థిస్తూ గవర్నమెంట్ పిటిషన్ ను కొట్టివేసింది.

Advertisement
ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?

తాజా వార్తలు