అట్టర్‌ఫ్లాప్‌ మూవీ రీమేక్‌!!

తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘సూదు కవ్వం’ సినిమాను హీరో రాజశేఖర్‌ తెలుగులో రీమేకÊ చేసిన విషయం తెల్సిందే.‘గడ్డం గ్యాంగ్‌’ పేరుతో రాజశేఖర్‌ ఈ సినిమాను కొన్ని నెలల క్రితం విడుదల చేశాడు.

 Gaddam Gang Movie To Be Remade In Hindi-TeluguStop.com

అయితే ఈ సినిమా వచ్చిన సంగతి అందరికి తెలిసే లోపు థియేటర్లలోంచి వెళ్లిపోయింది.కొన్ని థియేటర్లలో కనీసం రెండు మూడు రోజులు కూడా ఆడలేదు అంటే అతిశయోక్తి కాదు.

ఇంతటి డిజాస్టర్‌ అయిన ఈ సినిమాను రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

‘గడ్డం గ్యాంగ్‌’ సినిమా కథాంశం అనేది కొత్తది మరియు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేది.

కాని రాజశేఖర్‌ అండ్‌ గ్యాంగ్‌ ఆ కథను కూనీ చేసి వదిలారు.దాంతో ‘గడ్డం గ్యాంగ్‌’ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.

అయితే దీన్ని సరిగ్గా తీస్తే తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.తమిళంలో సక్సెస్‌ అయిన ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రముఖ నిర్మాత రాక్‌ లైన్స్‌ వెంకటేష్‌ ఈ సినిమాను బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లేందుకు సిద్దం అవుతన్నాడు.ఈయన ‘లింగ’, ‘పవర్‌’ వంటి సినిమాలు సౌత్‌ ప్రేక్షకులకు అందించాడు.

ప్రస్తుతం బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌తో సినిమా నిర్మిస్తున్నాడు.ఇక ఈ రీమేక్‌కు రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మించనున్నాడు.

మరి ఈ తెలుగు అట్టర్‌ ఫ్లాప్‌ ఫిల్మ్‌ బాలీవుడ్‌లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube