సూపర్‌ స్టార్‌కు నిజమైన మీనింగ్ ఇదే అంటున్న బాక్సాఫీస్‌‌

అభిమానులు కొందరు హీరోలను సూపర్‌ స్టార్‌ అని మరి కొందరు హీరోలను బ్లాక్ బస్టర్‌ స్టార్‌ అంటూ రకరకాలుగా పిలుచుకుంటాం.అయితే నిజమైన సూపర్‌ స్టార్‌ అంటే ఇలా ఉంటాడు అంటూ విజయ్‌ ను చూపించి తమిళ బాక్సాఫీస్‌‌ జనాలు అంటున్నారు.

 Tamil Movie Master Record Breaking Collections In South India , Kollywood, Lokes-TeluguStop.com

విజయ్‌ అభిమానులు కూడా సూపర్‌ స్టార్‌ కు నిజమైన అర్థం మావాడు అన్నట్లుగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.సూపర్‌ స్టార్‌ అంటే సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వసూళ్లు సాధించే వాడు అనడంలో సందేహం లేదు.

ఆ విషయం ఇప్పుడు మాస్టర్‌ సినిమా విషయంలో విజయ్‌ నిరూపించాడు.అద్బుతమైన సినిమా అంటూ మాస్టర్‌ ను పదే పదే ప్రచారం చేశారు.

కాని సంక్రాంతికి విడుదల అయిన మాస్టర్‌ సినిమా దారుణంగా ప్లాప్ అయ్యింది.అయినా కూడా వసూళ్ల విషయంలో మాత్రం కుమ్మేసింది.

తమిళనాట ఈ సినిమా మొదటి నాలుగు అయిదు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ ను సాధించినట్లుగా సమాచారం అందుతోంది.ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ సాధించింది.

సినిమాకు అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చింది.అయినా కూడా సూపర్‌ స్టార్‌ మూవీ కనుక ఒక సారి చూడవచ్చు అంటూ చాలా మంది థియేటర్ల కు క్యూ కట్టారు.

విజయ్ సూపర్‌ స్టార్‌ అనే బిరుదు కు అర్హుడు అనేందుకు ఇంత కంటే నిదర్శణం ఏం కావాలంటూ అభిమానులు గట్టిగా చెబుతున్నారు.ప్రతి సినిమాకు కూడా అద్బుతమైన రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో విజయ్ రియల్‌ సూపర్‌ స్టార్‌ అంటూ తమిళ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

విజయ్‌ హీరోగా తదుపరి రాబోతున్న సినిమా కూడా ఖచ్చితంగా ఫలితంతో సంబంధం లేకుండా వంద కోట్ల వసూళ్లు సాధిస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube