'ఆడై'పై ఆమె ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ రూ. 2 కోట్లు ముంచిందా?  

2cr Loss On Amala Paul Aadai Movie-aame Movie,amala Paul,amala Paul Aadai Movie

అమలాపాల్‌ నటించిన ‘ఆడై’ సినిమా గురించి తమిళ మీడియాలో చాలా ప్రముఖంగా కథనాలు వచ్చాయి. కొందరు విమర్శిస్తూ కామెంట్స్‌ చేస్తే మరి కొందరు సినిమాను గొప్పగా ప్రమోట్‌ చేశారు. అయితే సినిమాలో అమలాపాల్‌ న్యూడ్‌గా నటించడంతో పాటు, బోల్డ్‌ సీన్స్‌లో నటించడంతో సినిమా గురించి అందరిలో ఆసక్తి పెరిగింది. కాని సినిమా విడులైన తర్వాత ఆ సీన్స్‌ ఏమాత్రం సినిమాకు ఉపయోగపడలేదు..

'ఆడై'పై ఆమె ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ రూ. 2 కోట్లు ముంచిందా?-2Cr Loss On Amala Paul AAdai Movie

కనీసం ఆ సీన్స్‌ వల్ల మొదటి వారం రోజులు కూడా ఆడే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో ఆడై సినిమా అక్కడ ఇక్కడ బొక్క బోర్లా పడ్డట్లయ్యింది.

సినిమా ఫలితం హీరోయిన్స్‌కు పెద్దగా ప్రభావం ఉండదు. కాని ఈ చిత్రం ఫ్లాప్‌ హీరోయిన్‌ అమలాపాల్‌కు ఆర్ధికంగా చాలా పెద్ద వేసింది.

ఎందుకంటే సినిమా విడుదలకు ముందు ఆర్థికపరమైన ఇబ్బందులతో నిర్మాత ఉన్న సమయంలో అమలాపాల్‌ తనకు ఇచ్చిన పారితోషికం రిటర్న్‌ ఇవ్వడంతో పాటు తన సొంత డబ్బును కూడా కొంత మొత్తంలో ఇచ్చినట్లుగా తెలుస్తోంది..

సినిమా సక్సెస్‌ అయితే అమలాపాల్‌కు రెండు కోట్ల రూపాయలు ఇస్తానంటూ హామీ ఇచ్చాడట. కాని ఇప్పుడు సినిమా కనీసం వసూళ్లు కూడా రాబట్టలేక పోతుంది. సినిమా తెలుగు మరియు తమిళంలో రెండు చోట్ల కూడా ఫ్లాప్‌ అయ్యింది.

దాంతో అమలాపాల్‌కు రూ. 2 కోట్లు పోయినట్లే అంటూ తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరీ ఇంత దారుణంగా అమలాపాల్‌ బుక్‌ అవ్వడంతో ఆమెపై ఫ్యాన్స్‌ జాలి చూపుతున్నారు. సినిమాపై ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో డబ్బులు తిరిగి ఇచ్చింది..

అది కాస్త ఆమెకు చేటు చేసింది.