వరలక్ష్మి శరత్ కుమార్ ఆ క్రికెటర్ ని పెళ్లాడబోతుందట.. నిజమేనా...- Tamil Heroine Varalakshmi Sarath Kumar Marriage News Is Viral In Social Media

Tamil heroine Varalakshmi Sarath kumar Marriage news is viral in Social media, Varalakshmi Sarath kumar, Tamil heroine, Varalakshmi Sarath kumar love marriage news, Kollywood, Varalakshmi Sarath kumar marriage with Cricketer, - Telugu Kollywood, Tamil Heroine, Tamil Heroine Varalakshmi Sarath Kumar Marriage News Is Viral In Social Media, Varalakshmi Sarath Kumar, Varalakshmi Sarath Kumar Love Marriage News, Varalakshmi Sarath Kumar Marriage With Cricketer

తెలుగులో ఇటీవలే ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన “క్రాక్” చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి జయమ్మ పాత్రలో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే  క్రాక్  చిత్రానికంటే ముందుగా వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో పలు చిత్రాలలో నటించినప్పటికీ ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు.

 Tamil Heroine Varalakshmi Sarath Kumar Marriage News Is Viral In Social Media-TeluguStop.com

అయితే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో దుమారం రేపుతోంది.

అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ఇటీవలే వరలక్ష్మి శరత్ కుమార్ తమిళనాడుకు చెందినటువంటి ఓ ప్రముఖ క్రికెటర్ తో ప్రేమలో పడిందని తొందర్లోనే వీరిద్దరూ పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారని పలు వార్తలు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి.

 Tamil Heroine Varalakshmi Sarath Kumar Marriage News Is Viral In Social Media-వరలక్ష్మి శరత్ కుమార్ ఆ క్రికెటర్ ని పెళ్లాడబోతుందట.. నిజమేనా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వరలక్ష్మి శరత్ కుమార్ కి సంబందించిన ప్రేమ వార్తలు గతంలో కూడా పలుమార్లు బాగానే వైరల్ అయ్యాయి.ఆ మధ్య టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోతో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమాయణం నడిచిందని తొందర్లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.

కానీ వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రం తన పెళ్లిపై వస్తున్నటువంటి వార్తల గురించి ఏమాత్రం స్పందించ లేదు.మరి కనీసం క్రికెటర్ ని పెళ్లాడబోతున్నట్లు  వినిపిస్తున్నటువంటి ఈ వార్తలపై అయినా వరలక్ష్మి శరత్ కుమార్  స్పందిస్తుందో లేదో చూడాలి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం “నాంది” అనే చిత్రంలో నటిస్తోంది. ఈ  చిత్రంలో న్యాయం కోసం పోరాటం చేసే లాయర్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది.

 కాగా ఈ చిత్రంలో అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్నాడు. ఆ మధ్య ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కాగా మంచి ప్రేక్షకాదరణ లభించింది.

అయితే వరలక్ష్మి శరత్ కుమార్ మరోపక్క తమిళంలో కూడా దాదాపుగా 5 చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

#Tamil Heroine #TamilHeroine #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు