చాలా కాన్ఫిడెంట్ గా ఈ ఫొటోలో కనిపిస్తున్నది సమంత అనుకున్నారు కదా... కానీ కాదు...

తమిళంలో 2017 సంవత్సరంలో తమిళ ప్రముఖ దర్శకుడు శివ రాజ్ దర్శకత్వం వహించిన టువంటి “కాదల్ కన్ కదట్టు” అనే చిత్రం ద్వారా తమిళ సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన యంగ్ హీరోయిన్ “అతుల్య రవి” గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే పర్వాలేదనిపించడంతో వరుసగా హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకుంది.

 Tamil Heroine Athulya Ravi Looking Like Samantha Akkineni,tamil Heroine Athulya-TeluguStop.com

 అయితే ఈ అమ్మడు ఇప్పటివరకూ నటించింది చిన్న తరహా బడ్జెట్ చిత్రాలలోనే అయినప్పటికీ ఈ మధ్యకాలంలో ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ని బాగానే సంపాదించుకుంది.

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా  లాక్ డౌన్ విధించడంతో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది.

 అయితే తాజాగా అతుల్య రవి  ఓ  ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో తీసినటువంటి ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.అయితే ఇందులో అతుల్య రవి అచ్చం టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత అక్కినేని లాగ కనిపిస్తుండడంతో ఈ ఫోటోలను కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

 అంతేగాక ఈ ఫోటోలను షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే లక్ష యాభై వేల పైచిలుకు లైకులు కామెంట్లు వచ్చాయి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తమిళంలో అతుల్య రవి ప్రముఖ దర్శకుడు కమలాకణ్ణన్ దర్శకత్వం వహిస్తున్న”వట్టం” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రంలో తమిళ ప్రముఖ హీరోయిన్ నిక్కీ గల్రాని తదితరులు కూడా ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన దాదాపుగా 50 శాతం చిత్రీకరణ పనులు పూర్తి అయినట్లు సమాచారం.

 అలాగే ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న  అనే చిత్రంలో “మురుంగకాయ్ చిప్స్” అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించడానికి ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube