ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్ ని పెళ్లి చేసుకోవడం కోసం ఆ తమిళ్ హీరో ఏకంగా తన భార్యని కూడా....

తమిళంలో పలు ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ తమిళ హీరో విష్ణు విశాల్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో విష్ణు విశాల్ తాను నటించిన చిత్రాలతో కంటే ఎక్కువగా వివాదాలతోనే బాగా పాపులర్ అవుతున్నాడు.

 Tamil Hero Vishnu Vishal Shared His Girlfriend Gutta Jwala Pics In Instagram-TeluguStop.com

అయితే ఎప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో యాక్టివ్ గా  ఉండే విష్ణు విశాల్ తాజాగా తన ప్రియురాలితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసినటువంటి కారణంగా మళ్ళీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు.

అయితే ఇంతకీ విషయం ఏమిటంటే తాజాగా విష్ణు విశాల్ తన ప్రియురాలయిన ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలతో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తుండగా తీసినటువంటి కొన్ని ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.

 Tamil Hero Vishnu Vishal Shared His Girlfriend Gutta Jwala Pics In Instagram-ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్ ని పెళ్లి చేసుకోవడం కోసం ఆ తమిళ్ హీరో ఏకంగా తన భార్యని కూడా….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ విషయం ఇలా ఉండగా గతంలో విష్ణు విశాల్ మలయాళ దర్శకురాలు “రజనీ నటరాజ్” ని  2010వ సంవత్సరంలో తన కుటుంబ సభ్యుల కోరిక మేరకు పెళ్లి చేసుకున్నాడు.  కానీ పెళ్లయిన కొద్దికాలంలోనే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు, విభేదాలు రావడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

దీంతో పరస్పర అంగీకారంతో 2018వ సంవత్సరంలో విడనుకులు తీసుకున్నారు.

ఇందుకుగాను విష్ణు విశాల్ తన భార్యకి కోట్ల రూపాయలు ఇచ్చినట్లు  సమాచారం.

దీంతో కొందరు నెటిజన్లు అప్పటికే బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలతో విష్ణు విశాల్  ప్రేమలో పడటం వల్లే తన భార్యకు విడాకులు ఇచ్చాడని కామెంట్లు చేస్తున్నారు.కాగా ఇటీవలే గుత్తా జ్వాలతో విష్ణు విశాల్ నిశ్చితార్థం జరిగింది.

అందువల్లే ఈ మధ్య విష్ణు విశాల్ మరియు గుత్తా జ్వాలా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.

గత కొద్ది కాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్న విష్ణు విశాల్ తమిళంలో తెరకెక్కిన “రాటసన్” చిత్రం ద్వారా బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టి మళ్లీ ట్రాక్ ఎక్కాడు.

 దీంతో ప్రస్తుతం మలయాళంలో “ఎఫ్ఐఆర్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. అంతేగాక విష్ణు విశాల్ తన తదుపరి చిత్ర కథల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. దీంతో ప్రస్తుతం మలయాళం, తమిళం, తదితర భాషలలో కలిపి దాదాపుగా నాలుగు చిత్రాలలో హీరోగా నటిస్తున్నాడు.

#Kollywood #Tamil Hero #TamilHero #VishnuVishal #VishnuVishal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు