ఫారెన్ కారు టాక్స్ వివాదంలో హీరో విజయ్ కు ఊరట..!

తమిళనాడులో అగ్ర హీరోగా ఎంతో పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ కొనసాగుతున్న హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ప్రస్తుతం ఎన్నో తమిళ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

 Tamil Hero Vijay Against Entry Tax Case Update  Vijay,  Tax Case,  Kollywood,  F-TeluguStop.com

ఒక్కో సినిమాకు సుమారు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే విజయ్ కారు టాక్స్ విషయంలో గత ఏడాది వివాదాన్ని ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే.గత ఏడాది ఈయన ఇంగ్లండ్ నుంచి ఎంతో విలువైన లగ్జరీ కారు రోల్స్‌ రాయిస్‌ గోస్ట్‌ ను దిగుమతి చేసుకున్నారు అయితే ఈ కారు ఎంట్రీ పన్ను ఎగ్గొట్టారు.

దీంతో హీరో విజయ్ ఎగ్గొట్టిన పన్ను తిరిగి చెల్లించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.ఇలా కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో విజయ్ పన్ను మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు.

ఇలా పిటిషన్ దాఖలు చేయడంతో న్యాయమూర్తి సమాజంలో ఎంతో గొప్ప పేరున్న హీరోగా చలామణి అవుతూ ఇలా పన్ను కట్టకుండా ఉండడం సమంజసం కాదని, ఇలా చేయటం చట్టపరమైన నేరము అంటూ తనని ఈ చలానా కట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ విజయ్ పన్ను కట్టకపోవడంతో ఆయనకు లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ లక్ష రూపాయలను తమిళనాడు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.ఈ విధంగా హీరో విజయ్ పై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఈ తీర్పు ఇవ్వడంతో విజయ్ తన ఫారెన్ కారు ఎంట్రీ టాక్స్ చెల్లించారు.అయితే ఆ సమయంలో న్యాయస్థానం హీరో విజయ్ ను ఉద్దేశించి తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను రద్దుచేయాలని విజయ్ మరోసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా నేడు ఈ విషయంపై విచారణ జరిగిన అనంతరం ఈ కేసు మంగళవారానికి వాయిదా వేశారు.

మొత్తానికి విజయ్ ఫారెన్ కారు టాక్స్ విషయంలో ఆయనకు ఊరట లభించింది అని చెప్పాలి.

Tamil Hero Vijay Against Entry Tax Case Update Vijay, Tax Case, Kollywood, Faren Car , Tamil Hero , Kollywood, Tamil Nadu, Cm , - Telugu Faren Car, Kollywood, Tamil Vijay, Tamil Nadu, Tax

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube