ప్రేమించాను, పెళ్లిచేసుకుంటాను అని చెప్పి నమ్మించి మోసం చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.ప్రేమించిన యువతితో కొన్నాళ్ల పాటు సహజీవనం కూడా చేసాడు ఈ ప్రబుద్దుడు.
తీరా పెళ్లి చేసుకోమని ప్రియురాలు అడిగితే మొహం చాటేశాడు ఒక తమిళ నటుడు.అసలు వివరాలలోకి వెళితే చెన్నై రాజా అన్నామలైపురానికి చెందిన త్యాగరాజన్ (32) ‘తరిసూ నిలం’ అనే తమిళ సినిమాలో హీరోగా నటించాడు.
‘నాడోడిగళ్’ సినిమాలో సహాయ నటి పాత్ర పోషించిన మహిళతో అతడికి కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది.
వయసులో తన కంటే పెద్దదైన ఆమెతో ప్రేమ దోమ అని నాటకమాడి ఆమెను తన వెంట తిప్పుకున్నాడు త్యాగరాజన్.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొద్దిరోజులు సహజీవనం కూడా చేశాడు.ఈ క్రమంలోనే ఆమెతో లైంగిక వాంఛలు తీర్చుకోవడంతో పాటు భారీ మొత్తంలో నగదు తీసుకున్నాడు.ఇదిలా ఉండగా… త్యాగరాజన్ కి చెన్నై కార్పొరేషన్ లో ఒక మంచి ఉద్యోగం వచ్చింది.అప్పటి నుంచి సహాయనటితో మాట్లాడటం మానేశాడు.
దీంతో ఆ మహిళ గట్టిగా నిలదీయగా.‘నువ్వు నాకంటే వయసులో ఏడాది పెద్దదానివి.అందువల్ల మా పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకోరు.నువ్వే వేరొకరిని పెళ్లి చేసుకో’ అంటూ సలహా ఇచ్చాడు.
ప్రేమించేటప్పుడు తెలియలేదా నేను పెద్దదాన్ని అని నిలదీసి అడిగితే చంపేస్తానని బెదిరించాడు.దీంతో బాధితురాలు చెన్నైలోని మాంబలం మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
త్యాగరాజన్ పై కేసు నమోదు చేసి పోలీసులు గురువారం అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.