ఒకే దర్శకుడుతో వరుసగా మూడో సినిమాకి ఓకే చెప్పిన అజిత్

స్టార్ హీరోలకి ఎవరైనా దర్శకుడు భాగా కనెక్ట్ అయితే వారితో సినిమాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు.వరుసగా కాకున్నా వారు సబ్జెక్ట్ చెబితే కాదనకుండా ఒప్పేసుకుంటారు.

 Tamil Hero Ajith Third Movie Plan With Director Vinoth, Kollywood, Tollywood, Va-TeluguStop.com

టాలీవుడ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా అంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ కనీసం కథ కూడా వినకుండా ఒప్పుకుంటారు.అలాగే సుకుమార్ తో సినిమా అన్నా కొంత మంది హీరోలు వెంటనే ఒకే చెప్పేస్తారు.

వాళ్ళ మీద అలాంటి నమ్మకం హీరోలకి ఉంటుంది.ఇక కోలీవుడ్ లో హీరో విజయ్ అయితే దర్శకుడు అట్లీ, మురుగదాస్ కథ చెప్పకుండానే ఒప్పెసుకుంటాడు.

వాళ్ళ కాంబినేషన్ లో విజయ్ ఎక్కువ సినిమాలు చేశాడు.తరువాత స్టార్ హీరో అజిత్ కూడా దర్శకుడు శివతో వరుసగా మూడు సినిమాలు చేశాడు.

మూడు కూడా మంచి హిట్ అయ్యాయి.

అతని దర్శకత్వంలో సినిమా అంటే అజిత్ వెంటనే ఒకే చెప్పేస్తాడు.

ఇప్పుడు మరో యువ దర్శకుడు అజిత్ నుంచి అలంటి గుర్తింపు పొందాదు.అజిత్ హీరోగా పింక్ మూవీ రీమేక్ హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కింది.

ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.దీంతో అతని దర్శకత్వంలోనే వాలిమై అనే సినిమాని ప్రస్తుతం అజిత్ చేస్తున్నాడు.

ఈ సినిమా సెట్స్ పై ఉంది.ఇదిలా ఉండగానే అదే దర్శకుడుతో నెక్స్ట్ సినిమా కూడా చేయడానికి అజిత్ ఒకే చెప్పాడని తెలుస్తుంది.

రీసెంట్ గా వినోద్ అజిత్ కి స్టొరీలైన్ చెప్పాడని, అది నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడని తెలుస్తుంది.మొత్తానికి అజిత్ గా శివ తర్వాత వరుసగా మూడు సినిమాలు చేసే అవకాశాన్ని ఇప్పుడు వినోద్ సొంతం చేసుకున్నాడని కోలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube