2005 వ సంవత్సరం.. టాలీవుడ్ ను ఊచ కొత్త కోసిన 3 తమిళ్ డబ్బింగ్ సినిమాలు

మంచి కంటెంట్ ఉండాలే కానీ తెలుగు జనాలు ఏ భాష చిత్రాలనైనా ఆదరిస్తారు.గత కొంత కాలం క్రితం చక్కటి కథతో తెరకెక్కిన మలయాళం మూవీ బిచ్చగాడును మన జనాలు ఏ రేంజిలో ఆదరించారో తెలుసుకోవచ్చు.

 Tamil Dubbing Movie Top Hits In 2005 In Tollywood-TeluguStop.com

అలాగే ప్రతి ఏటా తెలుగులో పలు డబ్బింగ్ సినిమాలు వస్తూనే ఉంటాయి.మంచి కథ, కథనం ఉన్న సినిమాలు చక్కటి విజయాలు అందుకుంటూనే ఉంటాయి.

కొన్ని సినిమాలు మాత్రం ఓ రేంజిలో విజయం సాధించి అందరినీ ఆశ్చర్య పరిచాయి.తెలుగు స్ట్రెయిట్ సినిమాలను మించి వసూళ్లను సాధించాయి.2005లో విడుదలైన మూడు డబ్బింగ్ సినిమాలు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వసూళ్లు సాధించి అబ్బుర పరిచాయి.

 Tamil Dubbing Movie Top Hits In 2005 In Tollywood-2005 వ సంవత్సరం.. టాలీవుడ్ ను ఊచ కోత కోసిన 3 తమిళ్ డబ్బింగ్ సినిమాలు-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ ఏడాది ఏప్రిల్ లో రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా రిలీజ్ అయ్యింది.

ఈ సినిమా విడుదలకు ముందు పలు అనుమానాలు తలెత్తేలా టాక్ నడిచింది.రజనీ ఈ సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేశాడని లేడీ ఓరియెంటెడ్ సినిమా అని రకరకాల రూమర్లు వచ్చాయి.

కానీ ఈ సినిమా మొత్తంగా 13 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

అటు విక్రమ్, శంకర్ కాంబోలో వచ్చిన అపరిచితుడు సైతం ఓ రేంజ్ లో రిలీజ్ అయ్యింది.భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా మొత్తం 14 కోట్ల రూపాయల షేర్ సాధించింది.కనీవినీ ఎరుగని రీతిలో రీమేక్ మూవీ ఈ స్థాయి వసూళ్లు చేపట్టడం విశేషం.

Telugu Aparichithudu, Bigest Hits, Chanra Mukhi, Jgajini, Panden Kodi, Pramichtha, Tamil Dabbing, Tamil Dubbings, Tollywood-Telugu Stop Exclusive Top Stories

ఆ తర్వాత సూర్య నటించిన గజినీ సినిమా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా సైతం ఓ రేంజిలో సంచలన విజయం సాధించింది.బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 12 కోట్ల రూపాయల షేర్ అందుకుంది.మరో బిగ్గెస్ట్ డబ్బింగ్ సినిమా గజినీ నిలిచిపోయింది.ఈ మూడు సినిమాలే కాకుండా ఆ ఏడాది పలు డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలను డామినేట్ చేశాయి.పందెం కోడి, ప్రేమిస్తే లాంటి సినిమాలు కూడా ఓ రేంజిలో విజయాన్ని అందుకుని వారెవ్వా అనిపించాయి.

#Pramichtha #Panden Kodi #Tamil #Chanra Mukhi #Tamil

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు