మంచి కంటెంట్ ఉండాలే కానీ తెలుగు జనాలు ఏ భాష చిత్రాలనైనా ఆదరిస్తారు.గత కొంత కాలం క్రితం చక్కటి కథతో తెరకెక్కిన మలయాళం మూవీ బిచ్చగాడును మన జనాలు ఏ రేంజిలో ఆదరించారో తెలుసుకోవచ్చు.
అలాగే ప్రతి ఏటా తెలుగులో పలు డబ్బింగ్ సినిమాలు వస్తూనే ఉంటాయి.మంచి కథ, కథనం ఉన్న సినిమాలు చక్కటి విజయాలు అందుకుంటూనే ఉంటాయి.
కొన్ని సినిమాలు మాత్రం ఓ రేంజిలో విజయం సాధించి అందరినీ ఆశ్చర్య పరిచాయి.తెలుగు స్ట్రెయిట్ సినిమాలను మించి వసూళ్లను సాధించాయి.2005లో విడుదలైన మూడు డబ్బింగ్ సినిమాలు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వసూళ్లు సాధించి అబ్బుర పరిచాయి.
ఆ ఏడాది ఏప్రిల్ లో రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా రిలీజ్ అయ్యింది.
ఈ సినిమా విడుదలకు ముందు పలు అనుమానాలు తలెత్తేలా టాక్ నడిచింది.రజనీ ఈ సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేశాడని లేడీ ఓరియెంటెడ్ సినిమా అని రకరకాల రూమర్లు వచ్చాయి.
కానీ ఈ సినిమా మొత్తంగా 13 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
అటు విక్రమ్, శంకర్ కాంబోలో వచ్చిన అపరిచితుడు సైతం ఓ రేంజ్ లో రిలీజ్ అయ్యింది.భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా మొత్తం 14 కోట్ల రూపాయల షేర్ సాధించింది.కనీవినీ ఎరుగని రీతిలో రీమేక్ మూవీ ఈ స్థాయి వసూళ్లు చేపట్టడం విశేషం.
ఆ తర్వాత సూర్య నటించిన గజినీ సినిమా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా సైతం ఓ రేంజిలో సంచలన విజయం సాధించింది.బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 12 కోట్ల రూపాయల షేర్ అందుకుంది.మరో బిగ్గెస్ట్ డబ్బింగ్ సినిమా గజినీ నిలిచిపోయింది.ఈ మూడు సినిమాలే కాకుండా ఆ ఏడాది పలు డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలను డామినేట్ చేశాయి.పందెం కోడి, ప్రేమిస్తే లాంటి సినిమాలు కూడా ఓ రేంజిలో విజయాన్ని అందుకుని వారెవ్వా అనిపించాయి.