Tamil Directors : నటులుగా సక్సెస్ అవుతున్న తమిళ్ డైరెక్టర్స్… మరి మనవాళ్ల పరిస్థితి ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లకుంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.

ఇక తెలుగులో చాలా మంది నటులు అలా కష్టపడి సక్సెస్ ఫుల్ హీరోలుగా మారిన వాళ్లే.

ఇక ఇదిలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీ( Kollywood )లో డైరెక్టర్లందరు వరుసగా యాక్టర్లు అవుతున్నారు.వాళ్ళు మామూలు యాక్టింగ్ చేయడం లేదు.

నేషనల్ అవార్డులను సైతం గెలుచుకునేంతలా గొప్ప నటనను కనబరుస్తూ మంచి పేరు సంపాదించుకుంటున్నారు.

ఇక దాంతో వాళ్లు తమిళ్ ఇండస్ట్రీ లోనే కాకుండా ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజ్ ల్లో నటిస్తూ మంచి ఆర్టిస్టులుగా మారిపోతున్నారు.అందులో ముఖ్యంగా సముద్రఖని, గౌతమ్ మీనన్, ఎస్ జే సూర్య( Gautham Menon, SJ Suryah ) లాంటి డైరెక్టర్స్ వరుస సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు అయితే సంపాదించుకుంటున్నారు.ఇక ఇప్పటికే సముద్ర ఖని, ఎస్ జే సూర్య లాంటి దర్శకులకు నటనపరంగా నేషనల్ అవార్డు రావడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయమనే చెప్పాలి.

Advertisement

ఇక వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే మన దర్శకుల్లో తరుణ్ భాస్కర్ ఒక్కడే నటన మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ స్క్రీన్ మీద కనిపిస్తూ మంచి నటన ను కనబరుస్తున్నాడు.ఇక రీసెంట్ గా వచ్చిన కీడా కోలా( Keedaa Cola ) సినిమాతో ఫుల్ ఫ్లెడ్జ్ డ్ నటుడిగా మారిపోయి సినిమా మొత్తం చేశారనే చెప్పాలి.ఇక ఆయన్ని మినహాయిస్తే మిగిలిన వాళ్ళు చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్నారు తప్ప, ఫుల్ లెంత్ పాత్రలో నటించట్లేదు.

ఒక తరుణ్ భాస్కర్ మాత్రమే ఫుల్ లెంత్ రోల్లో నటిస్తున్నాడు.ఇక ఇది చూస్తున్న మన తెలుగు సినిమా అభిమానులు తమిళ్ డైరెక్టర్లు అంత బాగా సినిమాలు చేస్తుంటే మన డైరెక్టర్లలో ఎక్కువ మంది అసలు నటించడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదని మన దర్శకుల మీద విమర్శలు అయితే చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు