తెలుగు రాకపోయినా ఇక్కడి ప్రేక్షకులను మెప్పిస్తానంటున్న చైతూ డైరెక్టర్!

సినిమాలు సక్సెస్ అయ్యేందుకు భాష ముఖ్యం కాదు అంటున్నారు తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు.ఈయన తాజాగా ఒక అవార్డు ఫంక్షన్ లో పాల్గొనగా ప్రెజెంట్ చేస్తున్న నాగ చైతన్య సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.

 Tamil Director Venkat Prabhu Comments On Telugu Movies Details, Naga Chaitanya,-TeluguStop.com

తెలుగు రాకపోయినా తెలుగు సినిమా చేయడమే కాదు తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తాను అంటూ తెలిపాడు.అలాగే తెలుగు రాకపోయినా నేను చాలా కొత్త విషయాలను నేర్చుకుంటున్నట్టు తెలిపాడు.

హిందీ రాకపోయినా ప్రభుదేవా, మురుగుదాస్ లాంటి వారు బాలీవుడ్ లో సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు.మరి వీరి లాగానే అందరు పక్క భాషల్లో అవకాశాలు దక్కుతున్న నేపథ్యంలో వాటిని ఉపయోగించుకుని సక్సెస్ అయ్యేందుకు కృషి చేయాలని.

అక్కడి ప్రేక్షకులను మెప్పించ గలమా అనే అపనమ్మకం పెట్టుకోకూడదు అని ఆయన అప్ కమింగ్ ఫిలిం మేకర్స్ కు సూచించాడు.

అలాగే నాకు తెలుగు సినిమాకు వర్క్ చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది అని నేను చాలా కొత్త విషయాలు నేర్చుకోబోతున్నాను.

అక్కడి ప్రేక్షకులను తప్పకుండ మెప్పిస్తాను.

Telugu Ajith, Bailingwan, Venkat Prabhu, Krithi Shetty, Naga Chaitanya, Nagachai

ముందు ముందు మరిన్ని తెలుగు సినిమాలు తమిళ్ దర్శకులు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపాడు.ఇక ఈయనకు విజయ్, అజిత్ లతో మల్టీ స్టారర్ సినిమా తీయాలనే కోరిక ఉన్నట్టు తెలిపాడు.వెంకట్ ప్రభు తమిళ్ లో విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.

ఇక వెంకట్ ప్రభు, నాగ చైతన్య కాంబోలో రాబోతున్నట్టు సినిమా తమిళ్, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాను చైతూ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కించ బోతున్నారని సమాచారం.

ఇక ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.ఇందులో మరోసారి చైతూ తో కృతి శెట్టి కలిసి నటించ బోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube