ఆ ముగ్గురు లెజెండరీల కథతో సినిమా… ఆసక్తి చూపిస్తున్న దర్శకుడు  

Tamil Director Interested on SP Balu Biopic, South Indian Cinema, Kollywood, Tollywood, Ilayaraja, Bharathiraja, - Telugu Bharathiraja, Ilayaraja, Kollywood, South Indian Cinema, Sp Balu Biopic, Tollywood

దక్షిణభారతం మెచ్చే దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంతో మంది అభిమానులకి తీరని శోకం మిగిల్చి వెళ్లిపోయారు.భౌతికంగా ఆయన మన నుంచి దూరమైనా పాటలతో, మాటలతో ఎప్పటికి కోట్లాది మంది హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు.

TeluguStop.com - Tamil Director Interested On Sp Balu Biopic

అలాంటి గాన గంధర్వుడు జీవిత విశేషాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.ఎస్పీ బాలు పాట గురించి తెలిసినంతగా ఆయన జీవితం గురించి తెలియదు.

అలాగే అతని ప్రస్తానం ఎలా మొదలైంది, చిత్ర పరిశ్రమలో ఆయన ప్రయాణం ఎలా సాగింది అనే విషయాలు చాలా మందికి తెలియవు.అయితే ఇప్పుడు ఓ దర్శకుడుకి బాలు జీవితం సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది.

TeluguStop.com - ఆ ముగ్గురు లెజెండరీల కథతో సినిమా… ఆసక్తి చూపిస్తున్న దర్శకుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జీవితం మీద సినిమా తియ్యాలని వుందని తమిళ పదం వన్, తమిళ పదం టూ సినిమాల డైరెక్టర్ సి.ఎస్.అముధన్ సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేశాడు.కేవలం బాలు మీద మాత్రమే కాకుండా బాలుతో సహా మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా, డైరెక్టర్ భారతీరాజా స్నేహం మీద సినిమా తియ్యాలని వుందని చెప్పాడు.

గాయకుడిగా బాలు షోలు చేస్తున్నప్పుడు ఇళయరాజాకు ఆయన తన మ్యూజిక్ ట్రూపులో అవకాశం ఇచ్చారు.సంగీత దర్శకుడిగా ఉన్నత శిఖరాలకు ఇళయరాజా ఎదిగిన తరవాత స్నేహితుడు బాలుతో ఎన్నో పాటలు పాడించారు.

ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు.భారతీరాజాకి కూడా వీళ్ళతో మంచి స్నేహ బంధం వుంది.

గొప్ప గాయకుడు, గొప్ప సంగీత దర్శకుడు, గొప్ప దర్శకుడిగా ఎదిగిన ముగ్గురు స్నేహితుల ప్రయాణంతో ఈ కథని సిద్ధం చేయాలని అనుకుంటున్నట్లు సి.ఎస్.అముధన్ తెలియజేశాడు.సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో స్నేహానికి చిరునామా అయిన వీరి ముగ్గురు కథతో సినిమా అంటే చాలా నిర్మాతలు ముందుకి వస్తారు.

మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి కార్యరూపం దాల్చుతుందో వేచి చూడాలి.

#SP Balu Biopic #Ilayaraja #Kollywood #SouthIndian #Bharathiraja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tamil Director Interested On Sp Balu Biopic Related Telugu News,Photos/Pics,Images..