తమిళ దర్శకుడు బాబుశివన్ మృతి

అనారోగ్యంతో తమిళ దర్శకుడు బాబు శివన్ కన్నుమూశారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

 Tamilanadu, Movie Directer, Babu Shivan, Dead-TeluguStop.com

ఇతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.తమిళనాడులోని చెన్నైలో పుట్టిన బి.బాబుశివన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా తమిళ ఇండస్ట్రీలో తన కెరియర్ ను స్టార్ట్ చేశారు.ధరణి చిత్రానికి తను మొట్టమొదటి సారిగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.

దర్శకుడిగా స్టార్ హీరో విజయ్, అనుష్కతో ‘వెట్టైకరన్’ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమా అప్పట్లో భారీ వసూళ్లను కొల్లగొట్టింది.

సినిమా ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టి చాలా రోజుల తర్వాత ‘రసాతి’ అనే సీరియల్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు.

కొంత కాలంగా బాబుశివన్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.

ఇటీవల తన ఇద్దరు కుమార్తెలకు నీట్ పరీక్ష ఉండటంతో అతడి భార్య ఇద్దరు పిల్లలను తీసుకుని పరీక్ష రాయించడానికి వెళ్లింది.ఇంట్లో ఒక్కడే ఉన్న బాబుశివన్ ఆరోగ్యపరిస్థితి క్షీణించడంతో ఆయన అక్కడే అపస్మారకస్థితిలో పడిపోయాడు.

పరీక్ష ముగించుకుని ఇంటికి వచ్చిన భార్య పిల్లలు అతడిని చూసి వెంటనే ఆస్పత్రికి తరలించారు.మొదట వెళ్లిన ఆస్పత్రిలో కరోనా పేషంట్లకే చికిత్స అందిస్తామని చెప్పడంతో ఇంకో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడ వైద్యం లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పడంతో రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.అయితే అతడి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ బుధవారం ప్రాణాలు విడిచారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube