గ్రేట్‌ : నిజంగానే ఎన్టీఆర్‌ అలా చేశాడట, డైరెక్టర్‌ క్లారిటీ ఇచ్చాడు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌తో కలిసి స్క్రీన్‌ ను షేర్‌ చేసుకుంటున్నాడు.

 Tamil Director Atlee Comments On Ntr-TeluguStop.com

రికార్డు స్థాయి బడ్జెట్‌తో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఇదే సమయంలో ఎన్టీఆర్‌ ఈ చిత్రం తర్వాత అట్లీ కుమార్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ప్రశాంత్‌ నిల్‌ తో కూడా ఎన్టీఆర్‌ మూవీ ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.తాజాగా దర్శకుడు అట్లీ కుమార్‌ మాటలను బట్టి చూస్తుంటే ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ఎన్టీఆర్‌ చేయబోతున్న సినిమాకు ఆయన దర్శకత్వం వహించేలా అనిపిస్తుంది.

Telugu Bigil, Atlee, Atlee Vijay, Atlee Ntr, Ntr Atlee Kumar, Tamil Atlee Ntr, T

  వివరాల్లోకి వెళ్తే.అట్లీ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బిగిల్‌’ చిత్రం తెలుగు వర్షన్‌ విజిల్‌గా విడుదల చేయబోతున్నారు.విజిల్‌ ప్రమోషన్‌లో భాగంగా నిన్న హైదరాబాద్‌కు అట్లీ కుమార్‌ వచ్చాడు.మీడియాతో మాట్లాడిన అట్లీ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఎన్టీఆర్‌ గారితో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది.నా ప్రతి సినిమాకు ఆయన నుండి ఫోన్‌ వస్తుంది.

సినిమా బాగుందని ఆయన నాకు పలు సార్లు కాల్‌ చేసి చెప్పారు.ఆయనంటే నాకు చాలా ఇష్టం.

ఆయనపై నాకు చాలా గౌరవం ఉంది అన్నాడు.

Telugu Bigil, Atlee, Atlee Vijay, Atlee Ntr, Ntr Atlee Kumar, Tamil Atlee Ntr, T

  అట్లీ పలు సార్లు అట్లీ కుమార్‌కు ఫోన్‌ చేసి సినిమా బాగుందంటూ ప్రశంసించాడు అంటూ వార్తలు వచ్చాయి.కాని చాలా మంది వాటిని పుకార్లుగా కొట్టి పారేసేవారు.కాని అట్లీ కుమార్‌ స్వయంగా చెప్పడంతో నిజంగానే ఎన్టీఆర్‌ అలా చేశాడని వెళ్లడయ్యింది.

ఒక తమిళ దర్శకుడిని ప్రశంసిస్తూ ఫోన్‌ చేయడం నిజంగా ఎన్టీఆర్‌ గొప్పతనం అని, ఎన్టీఆర్‌ ఒక గ్రేట్‌ హీరో అంటూ అభిమానులు చెప్పుకుంటున్నారు.మొత్తానికి అట్లీ కుమార్‌తో సినిమా చేయడానికి ఎన్టీఆర్‌ ఆసక్తిగా ఉన్నాడని దీంతో అర్థం అయ్యింది.

ఇదే సమయంలో అట్లీ త్వరలోనే ఒక తెలుగు సినిమా చేస్తానంటూ ప్రకటించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube