పెళ్లితో ఓ ఇంటివాడైన స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా?  

Tamil Comedian Yogi Babu Ties Knot - Telugu Kollywood Movie News, Marriage, Tamil Comedian, Ties Knot, Yogi Babu

తమిళ సినిమా ఇండస్ట్రీలో కమెడియన్‌గా యోగి బాబు తనదైన మార్క్ వేసుకున్నాడు.గతంలో వడివేలు ఎలాంటి పేరు సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే.

Tamil Comedian Yogi Babu Ties Knot

టాలీవుడ్‌లో బ్రహ్మానందం ఎలాంటి పేరు సంపాదించుకున్నాడో, తమిళంలో వడివేలు కూడా అలాంటి క్రేజ్ దక్కించుకున్నాడు.కాగా ఇప్పుడు ఆయన స్థానాన్ని యోగి బాబు చేజిక్కించుకున్నాడు.

యోగి సినిమాతో కోలీవుడ్‌లో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న యోగి బాబు, ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ నటిస్తున్నాడు.యోగి బాబు లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు.

కాగా తాజాగా యోగి బాబు సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నాడు.మంజు భార్గవి అనే అమ్మాయిని తిరుట్టని గ్రామంలో ఆమెను వివాహమాడాడు యోగి బాబు.

చాలా సాదాసీదాగా ఈ వివాహ వేడుకను నిర్వహించారు.

కాగా ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలకు మార్చిలో రిసెప్షన్ వేడుకను నిర్వహించేందుకు యోగి బాబు నిర్ణయించుకున్నాడు.

ఈ సందర్భంగా యోగిబాబుకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

తాజా వార్తలు

Tamil Comedian Yogi Babu Ties Knot-marriage,tamil Comedian,ties Knot,yogi Babu Related....