15 ఏళ్లకే హీరోయిన్ అవకాశం కొట్టేసిన చైల్డ్ ఆర్టిస్ట్!  

సినిమా ఇండస్ట్రీలో అవకాశం దక్కాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.నటనా నైపుణ్యం ఉన్నా అవకాశాలు రావడం చాలా అరుదుగా ఉంటుంది.

TeluguStop.com - Tamil Child Artist Anikha Entry Into Tollywood As Heroine

ఇండస్ట్రీ లో అవకాశాలు దొరకాలంటే సినీ బ్యాక్ గ్రౌండ్ ఉంటే కానీ తొందరగా అవకాశాలు లభించవు.చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తున్న వారిలో కొంతమందికి సినిమాలలో నటించే అవకాశం లభిస్తూ ఉంటుంది.

అలాంటి కోవకు చెందినదే ఈ అనిఖ.చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీరంగంలోకి ఎంటరై బాలనటిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న అనిఖ ఏకంగా సినిమాలలో హీరోయిన్ అవకాశం కొట్టేసింది.

TeluguStop.com - 15 ఏళ్లకే హీరోయిన్ అవకాశం కొట్టేసిన చైల్డ్ ఆర్టిస్ట్-General-Telugu-Telugu Tollywood Photo Image

కేవలం 15 సంవత్సరాలకే హీరోయిన్ అవకాశం కొట్టేసిన అనిఖ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఎన్నై అరిందాల్, విశ్వాసం వంటి చిత్రాలలో బాలనటిగా తన ప్రతిభ కనబరిచింది.అంతేకాకుండా తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత బయోగ్రాఫికల్ డ్రామా గా వచ్చిన క్వీన్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి అందరి ప్రశంసలు పొందింది.చైల్డ్ ఆర్టిస్ట్ గా కేరళ ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న అనిఖ సురేంద్ర‌న్‌ ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ గా నటించే అవకాశం కొట్టేసింది.

15 ఏళ్లకే తన నటనతో అందరినీ మెప్పించి, హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన అనిఖ 30 ఏళ్ల వయసు వచ్చే సరికి ఎలా నటిస్తుందో ఊహించుకోవాల్సిందే.మలయాళ సూపర్ హిట్ చిత్రమైన క‌ప్పెల‌ ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.అయితే ఈ సినిమాలో న‌వీన్ చంద్ర‌, విశ్వ‌క్ సేన్ హీరోలుగా నటించనున్నారు.ఈ సినిమాలో ఫిమేల్ రోల్ చేయడానికి అనిఖ ఎంపిక చేసినట్లు టాలీవుడ్ సమాచారం.ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ చేసిన వ్యక్తి దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సినీ వర్గాల సమాచారం.

#Remake Film #Heroine #EntryInto

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు