మోదీకి బిగ్ షాక్ ఇచ్చిన తమిళ ముఖ్యమంత్రి స్టాలిన్.. నివ్వెరపోయిన మోదీ

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రూటే సపరేటు అనే విషయం చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది.ఆయన తాజాగా మోదీ పర్యటనలో చేసిన పనులు కూడా ఇదే పద్ధతికి అద్దం పట్టేలా ఉన్నాయి.

 Tamil Chief Minister Stalin Gave A Big Shock To Modi In Chennai Tour Details,-TeluguStop.com

అతడిని పల్లెత్తు మాట అనకుండా ప్రధాని అనే మర్యాదను ఎక్కడా తగ్గించకుండా మోదీకి స్టాలిన్ బిగ్ షాక్ ఇచ్చారని పలువురు చెప్పుకుంటున్నారు.మోదీ ముందే మాకు ఇది కావాలని ఆయనను డిమాండ్ చేయడం స్టాలిన్ తెలివికి నిదర్శనం అని చెబుతున్నారు.

వివరాల్లోకి వెళితే. దేశ ప్రధాని మోదీ నిన్న హైదరాబాద్ పర్యటన ముగించుకుని ఇక్కడి నుంచి డైరెక్టుగా తమిళనాడుకు వెళ్లారు.

ఆయన అక్కడ రూ.31 వేల కోట్లతో 11 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ తో కలిసి ఒక సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ పార్టీకి చెంపపెట్టులా మారాయని అంతా కామెంట్ చేస్తున్నారు.

రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈ సందర్భంగా స్టాలిన్ ప్రస్తావించారు.తమ రాష్ట్రానికి నీట్ పరీక్ష అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు.ఇదే విషయంపై ఇప్పటికే మేము అసెంబ్లీలో తీర్మానం చేశామని చెప్పారు.అంతే కాకుండా తమ భాషను రాష్ట్ర హై కోర్టులో అధికారిక భాషగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు.

Telugu Cm Stalin, Fishermen, Modi, Modi Chennai, Stalin, Tamil Language-Politica

మత్య్స కారులు స్వేచ్ఛగా చేపలు పట్టేందుకు వీలుగా శ్రీలంక ఆధీనంలో ఉన్న కచ్చతీవు ద్వీపాన్ని తిరిగి పొందాలని ఆయన మోదీకి విన్నవించారు.తమిళనాడుకు కేంద్రం ఇవ్వాల్సిన జీఎస్టీ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.మోదీకి ద్రవిడ మోడల్ గురించి తెలిపారు.ఈ మోడల్ లో నే తాము రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలియజేశారు.స్టాలిన్ మిగతా ముఖ్యమంత్రుల వలే కాకుండా చాలా డిఫరెంట్ గా వ్యవహరించారని అందరూ చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube