ఈ హీరోయిన్ లాక్ డౌన్ లో సీక్రెట్ గా పెళ్లి చేసుకుందట… కానీ…   

Yashika anand, Kollywood actress, Marriage news, Kollywood, Actress Yashika Responds about marriage - Telugu Actress Yashika Responds About Marriage, Kollywood, Kollywood Actress, Marriage News, Yashika Anand

తమిళంలో ప్రముఖ హీరో జీవా హీరోగా నటించిన కావలై వెండామ్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి నటిగా సినీ పరిశ్రమకు పరిచయమైన బ్యూటిఫుల్ హీరోయిన్ యాషిక ఆనంద్ గురించి తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చీ రావడంతోనే ఏకంగా సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ ఆ చిత్రంలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరు గుర్తించలేదు.

 Tamil Actress Yashika Anand Reacts About Her Marriage

దీంతో కొంత కాలం పాటు సినిమా అవకాశాలు లేక ధారావాహికలలో కూడా నటించింది.

అయితే ఇంటి ఇంతకీ విషయం ఏంటంటే ఈమధ్య యాషిక ఆనంద్ ఓ ప్రముఖ ఫోటో షూట్ సంస్థ నిర్వహించిన ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొని పెళ్లి కూతురు దుస్తులలో ఫోజులు ఇచ్చింది.

ఈ హీరోయిన్ లాక్ డౌన్ లో సీక్రెట్ గా పెళ్లి చేసుకుందట… కానీ… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో కొందరు నెటిజన్లు ఆమె ఫోటోలను ట్రోల్స్ చేస్తూ యాషిక ఆనంద్ లాక్ డౌన్ సమయంలో ఎవరికీ చెప్పకుండా రహస్యంగా తన ప్రియుడితో ప్రేమ వివాహం చేసుకుందని కామెంట్ చేస్తూ వార్తలను ప్రచారం చేస్తున్నారు.

దీంతో తాజాగా యాషిక ఆనంద్ ఈ విషయం గురించి స్పందించింది.

ఇందులో భాగంగా తాను ఎవరినీ రహస్యంగా పెళ్లి చేసుకోలేదని కేవలం ఫోటో షూట్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పెళ్ళి కూతురు దుస్తులను ధరించి ఫోజులు ఇచ్చానని స్పష్టం చేసింది.అంతేగాక తనకు ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదని, అలాగే  కావాలనే కొంత మంది  నిజానిజాలు తెలుసుకోకుండా తన గురించి ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాషికా ఆనంద్ తమిళంలో ప్రముఖ దర్శకుడు నరేష్ సంపత్ దర్శకత్వం వహిస్తున్న “రాజా బీమా” అనే చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది.అలాగే “ఇవన్ తన్ ఉత్తమన్” అనే చిత్రంలో  నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

#Yashika Anand #ActressYashika #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tamil Actress Yashika Anand Reacts About Her Marriage Related Telugu News,Photos/Pics,Images..