వ్యాక్సిన్ వేసుకున్నా కూడా కరోనా వస్తుంది..  కానీ ప్రాణం మాత్రం...

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ఎంతగా కలకలం సృష్టిస్తున్నదో కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఇప్పటికే ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా దాదాపు 4 లక్షల పైచిలుకు మంది ప్రజలు మృత్యువాత పడ్డారు.

 Tamil Actress Varalakshmi Sarathkumar Giving Awareness On Corona Vaccine, Varala-TeluguStop.com

అంతే కాకుండా మరో 20 లక్షల మందికి పైగా ప్రజలు అనారోగ్య ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కాగా దీంతో పలువురు సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకులు ఈ కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు పలు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

అంతేకాకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొని ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రచారం చేస్తున్నారు.

ఇందులో భాగంగా తాజాగా తెలుగు ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఓ వీడియో ద్వారా కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రేక్షకులకి తెలిపింది.

అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ విపత్కర సమయంలో వ్యాక్సిన్ తీసుకునేందుకు ఎవరూ కూడా భయ పడవద్దని సూచించింది.అలాగే ద్విచక్ర వాహనం నడిపే సమయంలో హెల్మెట్ మనకు దెబ్బలు తగలకుండా ఎలా కాపాడుతుందో అలాగే వ్యాక్సిన్ కూడా కరోనా వైరస్ నుంచి మన ప్రాణాలను కాపాడుతుందని తెలిపింది.

కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లేనిపోని అనుమానాలు, భయం వంటి వాటికి భయపడకుండా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకుని తమతోపాటు తమ కుటుంబ సభ్యులను కూడా సురక్షితంగా ఉంచాలని తెలిపింది.దీంతో కొందరు నెటిజన్లు వరకు వరలక్ష్మి శరత్ కుమార్ ని అభినందిస్తున్నారు.

Telugu Corona Vaccine, Corona, Tamil Actress, Tamilactress-Movie

ఈ విషయం ఇలా ఉండగా ఈ ఏడాది మొదట్లో వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన “క్రాక్” చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా అలరించింది.దీంతో ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ కి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, సినిమా పరిశ్రమలలో వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube