అల్లు అర్జున్ సినిమాలో జయమ్మ.. ఈసారి ఆ పాత్రలో?- Tamil Actress Varalakshmi In Stylish Star Allu Arjun Movie

tamil actress varalakshmi in allu arjun movie, tollywood, alluarjun, varalakshmi, jayamma, krack, koratala shiva, bhasker, sukumar, pushpa, #AA21, student leader role - Telugu Aa21, Alluarjun, Bhasker, Jayamma, Koratala Shiva, Krack, Pushpa, Student Leader Role, Sukumar, Tollywood, Varalakshmi

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా దూసుకుపోతున్నారు.ఇక ఈయన నటన తో మంచి గుర్తింపు పొందుకొని ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.

 Tamil Actress Varalakshmi In Stylish Star Allu Arjun Movie-TeluguStop.com

అల్లుఅర్జున్ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు ఫోటోల షేర్ల తో బిజీగా ఉంటాడు.అంతేకాకుండా ఆయన పిల్లలతో చేసే అల్లర్లను కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉండగా.ఈ ఏడాది విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

 Tamil Actress Varalakshmi In Stylish Star Allu Arjun Movie-అల్లు అర్జున్ సినిమాలో జయమ్మ.. ఈసారి ఆ పాత్రలో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో చేయనున్నాడు.

Telugu Aa21, Alluarjun, Bhasker, Jayamma, Koratala Shiva, Krack, Pushpa, Student Leader Role, Sukumar, Tollywood, Varalakshmi-Movie

#AA21 గా తెరకెక్కనున్న సినిమాలో ప్రథమార్థంలో స్టూడెంట్ లీడర్ గా, ద్వితీయార్థంలో రాజకీయ నాయకుడిగా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.త్వరలోనే ఈ సినిమా సెట్ లోకి వెళ్ళనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరొక వార్త సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది.

ఇందులో స్టార్ కూతురు నటించనున్నట్లు వార్తలు ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు నటి వరలక్ష్మి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనుందట.ఇదివరకే క్రాక్ సినిమాలో వరలక్ష్మి జయమ్మ పాత్రలో నటించగా.

ఈ పాత్ర తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అంతేకాకుండా అల్లరి నరేష్ నటించిన నాంది సినిమాలో ఆద్యగా బాగా మెప్పించింది.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాలో వరలక్ష్మి రాజకీయ నాయకురాలి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమా గురించి త్వరలోనే సినీ బృందం మరిన్ని ప్రకటనలు చేయనున్నారు.

ఇక డైరెక్టర్ భాస్కర్ తో అల్లు అర్జున్ మరో సినిమా చేయనున్నాడట.మొత్తానికి అల్లు అర్జున్ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నాడు.

#Koratala Shiva #Jayamma #Sukumar #Krack #AA21

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు