ఆ నిర్మాత నన్ను బెడ్ రూమ్ కి పిలిచాడంటున్న హీరోయిన్... అందుకేనా...

కోలీవుడ్లో ఇటీవల విడుదలైన టువంటి “ఓ మై  కడవలె” అనే చిత్రం తమిళ్ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.అయితే ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించిన వాణి భోజన్ తనకి ఇది మొదటి చిత్రం అయినప్పటికీ బాగానే అలరించింది.

 Tamil Actress Vani Bhojan Sensational Comments On Casting Couch-TeluguStop.com

అయితే తాజాగా వాణి భోజన్ ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొంది.ఇందులో భాగంగా సినీ పరిశ్రమలో ఆడవాళ్లపై జరుగుతున్నటువంటి లైంగిక వేధింపుల సమస్య క్యాస్టింగ్ కౌచ్ సమస్యపై స్పందించింది.

అలాగే తన సినీ కెరీర్ లో ఎదురైనటువంటి కొన్ని విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

సినీ పరిశ్రమకు వచ్చిన మొదట్లో తాను అవకాశాల కోసం తీవ్రంగా శ్రమించానని కానీ అవకాశాలు వచ్చేవి కాదని అన్నారు.

అయితే ఒకానొక సమయంలో మాయ సీరియల్ లో నటించే అవకాశం దక్కిందని దాంతో తన కెరీర్ మొదలైందని చెప్పుకొచ్చింది.అయితే ఆ తర్వాత తన డేట్లని చూడడం కోసం మేనేజర్ ని నియమించుకున్నానని తెలిపారు.

అయితే కొంతమంది సినీ నిర్మాతలు తనకి కమిట్మెంట్ ఇస్తే అవకాశాలు ఇస్తామని తమ మేనేజర్ ద్వారా సంప్రదించారని కానీ తనకు అలాంటి అవకాశాలు వద్దని నిర్మొహమాటంగా తెగేసి చెప్పిందట.దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కోలీవుడ్లో సంచలనం రేపుతున్నాయి.

అంతే కాక ఇలా కమిట్మెంట్ ద్వారా వచ్చిన అవకాశాలు ఎంతో కాలం ఉండవని, అంతేగాక  ఇంకెప్పుడైనా అవకాశలకోసం దర్శక నిర్మాతలను సంప్రదించినా తమ నుంచి ఇలాంటి కమిట్మెంట్ ఆశిస్తారని కాబట్టి తాను ఆదిలోనే అటువంటి వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చింది.

Telugu Tamilactress-Movie

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో వైభవ్ నటిస్తున్నటువంటి లాకప్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఎస్.చార్లెస్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రం కూడా తొందరలోనే పట్టాలెక్కనుంది.ఏదేమైనప్పటికీ వాణి భోజన్ బుల్లితెర నుంచి వెండితెరకి అడుగు పెట్టి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube