తన రెండో మొగుడు టార్చర్ చేస్తున్నాడంటూ పోలీసులను సంప్రదించిన హీరోయిన్...

ప్రస్తుత కాలంలో కొందరు ఏ మాత్రం ఆలోచించకుండా తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోవడంతో అనవసరంగా చిక్కుల్లో పడుతున్నారు.కాగా తాజాగా ఓ హీరోయిన్ తన మొదటి భర్త సరిగ్గా చూసుకోవడం లేదని అతడిని వదిలేసి స్థానికంగా ఉన్న పోలీస్ ఠాణాలో పని చేస్తున్న ప్రభుత్వ అధికారిని పెళ్లి చేసుకొని చివరికి అతడు కూడా టార్చర్ చేస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Tamil Actress Radha Complaint Against Her Second Husband-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే తమిళ సినీ పరిశ్రమలో పలు ధారావాహికలు మరియు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించిన రాధ అనే సినీ నటి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతంలో నివాసం ఉంటుంది.అయితే ఈ అమ్మడు తన మొదటి భర్తతో పలు వ్యక్తిగత కారణాల వల్ల మనస్పర్ధలు, విభేదాలు, రావడంతో విడాకులు తీసుకుంది.

దీంతో ఈ ఇద్దరికీ పుట్టిన కొడుకు బాధ్యతలను కూడా తనే తీసుకుంది.

 Tamil Actress Radha Complaint Against Her Second Husband-తన రెండో మొగుడు టార్చర్ చేస్తున్నాడంటూ పోలీసులను సంప్రదించిన హీరోయిన్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా గత కొద్దికాలంగా కొడుకుతో ఒంటరిగా ఉంటున్న రాధ కి స్థానికంగా పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్.ఐ తో పరిచయం ఏర్పడింది.అయితే మొదట్లో ఎస్.ఐ రాధతో శారీరిక సంబంధం పెట్టుకోవాలని అనుకున్నప్పటికీ రాధ మాత్రం కొంతమేర డీప్ గా అతని ప్రేమలో కూరుకుపోయింది.దీంతో పలుమార్లు తనని పెళ్లి చేసుకోవాలంటూ ఎస్.ఐ రాధ బలవంత పెట్టింది. అయితే ఆ ఎస్.ఐ మాత్రం తన లైంగిక వాంఛలు తీర్చుకున్న తర్వాత పెళ్లి మాట ఎత్తడంతో మొహం చాటేస్తూ వచ్చాడు.

దీంతో విషయం అర్థం చేసుకున్న  రాధ తన ఇంటి అడ్రస్సు మరియు కొడుకు తండ్రి పేరు ఇలా అన్ని ఐఎస్ఐ పేరు మీదుగా మార్చింది.

దీంతో ఎస్.ఐ   గుట్టుచప్పుడు కాకుండా రాద ని తన ఇంట్లో అతికొద్ది మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.కానీ పెళ్లయిన తర్వాత వీరిద్దరి మధ్య తరచూ ఏదో ఒక విషయంపై గొడవలు, మనస్పర్థలు వచ్చాయి.దీంతో ఎస్.ఐ టార్చర్ చేయడం మొదలు పెట్టాడు.దాంతో ఇటీవలే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన భర్త చేస్తున్న ఆగడాలు రోజురోజుకీ మితిమీరి పోతున్నాయని కాబట్టి తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను కోరింది.

#HarassmentCase #RadhaSecond #Tamil Actress #Radha #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు