ఆ హీరోతో నాకు అలాంటి సంబంధం లేదంటున్న హీరోయిన్...

ప్రస్తుత కాలంలో సినీ హీరోలు లేదా హీరోయిన్లు ఎవరితోనైనా సన్నిహితంగా మెలుగుతూ ఉంటే చాలు వారి గురించి క్షణాల్లో వందల కథలు పుట్టుకొస్తుంటాయి.సరిగ్గా ఇలాగే తమిళ ప్రముఖ నటుడు కమల్ హాసన్ విషయంలో కూడా జరిగింది.

 Pooja Kumar, Tamil Actress, Kamal Hassan, Kollywood, Bharateeyudu-2, Shankar, Lo-TeluguStop.com

ఇటీవల కాలంలో నటుడు కమల్ హాసన్ స్వయంగా దర్శకత్వం వహించిన టువంటి విశ్వరూపం చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన నటి పూజా కుమార్ గురించి తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు గత కొద్దికాలంగా కమల్ హాసన్ కుటుంబంతో కొంత మేర సన్నిహితంగా మెలుగుతుంది.

దీంతో కొందరు వ్యక్తులు ప్రస్తుతం పూజా కుమార్ కమల్ హాసన్ తో రిలేషన్ లో ఉన్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.అయితే తాజాగా ఈ విషయంపై నటి పూజా కుమార్ స్పందించింది.

ఇందులో భాగంగా తనకి కమల్ హాసన్ కుటుంబ సభ్యులకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందువల్ల తరచూ కమలహాసన్ మరియు ఆయన కుటుంబ సభ్యులను కలుస్తుంటానని చెప్పుకొచ్చింది.దీంతో అందరూ తనకి కమల్ హాసన్ కి మధ్య ఏదో ఉందని తప్పుగా అర్థం చేసుకున్నారని అందులో ఎలాంటి వాస్తవం లేదని అంటూ క్లారిటీ ఇచ్చింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కమల్ హాసన్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నటువంటి భారతీయుడు-2 చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించినటువంటి భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతోంది.

కాగా ఈ చిత్రంలో కమల్ హాసన్ కి జోడిగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, ప్రముఖ నటుడు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube