ఓటిటి లో విడుదల కాబోతున్న వెటరన్ హీరోయిన్ కొత్త చిత్రం...

తెలుగులో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, మాస్ మహారాజా రవితేజ, వంటి స్టార్ హీరోల చిత్రాలలో హీరోయిన్ గా నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “హీరోయిన్ జ్యోతిక” గురించి తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే నటి జ్యోతిగా స్వతహాగా తమిళ సినిమా పరిశ్రమకు చెందిన నటి అయినప్పటికీ టాలీవుడ్లో కూడా హీరోయిన్ గా నటించి తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకుంది.

 Tamil Actress Jyothika New Movie Raktha Sambandham Release In Ott, Raktha Samban-TeluguStop.com

దీంతో ఈ మధ్యకాలంలో నటి జ్యోతిక ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ పాత్రలకి ప్రాధాన్యత ఉన్నటువంటి చిత్రాలలో నటిస్తోంది ఈ క్రమంలో తన చిత్రాలను తమిళం తెలుగు కన్నడ ఇతర భాషలలో కూడా అనువాదం చేస్తూ విడుదల చేస్తోంది.

కాగా ప్రస్తుతం నటి జ్యోతిక రక్త సంబంధం అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.

కాగా ఈ చిత్రానికి తమిళ ప్రముఖ దర్శకుడు శరవణన్ దర్శకత్వం వహిస్తుండగా నటి జ్యోతి నిర్మాతగా వ్యవహరించింది.కాగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో విడుదల చేస్తున్నారు.

కాగా ఈ చిత్రంలో నటి జ్యోతిక తో పాటు ప్రముఖ తమిళ నటుడు శశి కుమార్ మరియు సముద్రఖని, సూరి, నివేదిత సతీష్, కాలాయరసన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.కాగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలు సినిమా థియేటర్లకు వచ్చే సూచనలు లేకపోవడంతో ఈ చిత్రాన్ని ప్రముఖ అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 14వ తారీఖున నుంచి ప్రసారం చేయనున్నారు.

అయితే ఈ చిత్రం కోసం ప్రైమ్ దాదాపుగా మూడు కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ వెచ్చించినట్లు సమాచారం.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి జ్యోతిక దాదాపుగా మూడు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.

ఇందులో రెండు చిత్రాలకి నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube