తమిళ నటుడు విజయకాంత్ కు కరోనా పాజిటివ్  

Tamil Actor Vijayakanth Tested Positive for COVID-1,Chennai MIOT Hospital, Coronavirus, DMDK, Vijayakanth, Vijayakanth Test Positive - Telugu Chennai Miot Hospital, Corona, Coronavirus, Dmdk, Positive, Tamil Actor, Tamil Actor Vijayakanth Tested Positive For Covid-1, Vijayakanth, Vijayakanth Test Positive

రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.ఇప్పటికే రాష్ట్రంలో 5 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

TeluguStop.com - Tamil Actor Vijayakanth Tested Positive

ఇప్పటివరకూ 8,947 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.వైరస్ విస్తరణతో పాటు మరణాల రేటు కూడా అధికంగా ఉండటంతో తమిళ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఒకరి నుంచి మరొకరికి వైరస్ ఈజీగా సోకుతుంది.సామాన్య ప్రజల నుంచి ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు వైరస్ బారిన పడుతున్నారు.

TeluguStop.com - తమిళ నటుడు విజయకాంత్ కు కరోనా పాజిటివ్-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆస్పత్రిలో ఉంటూ కొందరు చికిత్స పొందుతుండగా.మరికొందరూ హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స చేయించుకుంటున్నారు.

తాజాగా తమిళ స్టార్ నటుడు, రాజకీయ నాయకుడు విజయ కాంత్ కు కరోనా పాజిటివ్ వచ్చింది.గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 22 తేదీన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాడు.

రిపోర్టుల్లో పాజిటివ్ రావడంతో కుటుంబసభ్యులు ఆయన చెన్నైలోని ఎంఐఓటీ ఆస్పత్రిలో జాయిన్ చేయించారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ పృధ్వీ మోహన్ దాస్ తెలిపారు.

కాగా, విజయకాంత్ సినిమా ఇండస్ట్రీ నుంచి దూరమైన తర్వాత డీఎండీకే (దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం) పార్టీని స్థాపించారు.ప్రస్తుతం ఆ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

అధికార పార్టీ అయిన ఏఐఏడీఎంకేకి మిత్రపక్షంగా కొనసాగుతున్నారు.ప్రతి ఆరు నెలలకు ఒకసారి సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవడం విజయకాంత్ కు అలవాటు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అనారోగ్యానికి గురయ్యారు.కరోనా లక్షణాలు కనిపించడంతో నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు.

ప్రస్తుతం విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, త్వరలో కోలుకుని ప్రజా సేవలో పాల్గొంటారని పార్టీ వర్గాలు ప్రకటించాయి.

#Tamil Actor #ChennaiMIOT #Corona #Positive #DMDK

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tamil Actor Vijayakanth Tested Positive Related Telugu News,Photos/Pics,Images..