మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్న తమిళ నటుడు

ఈ మధ్య కాలంలో పలువురు సెలబ్రెటీలు ఆర్ధిక బాధలతో, అవకాశాలు లేక మానసిక ఒత్తిళ్లతో ఇతర కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశం మొత్తం సంచలనంగా మారింది.

 Tamil Actor Thennarasu Commits Suicide, Kollywood, Indian Cinema, Celebrities Su-TeluguStop.com

మానసిక ఒత్తిడి తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది.ఆ ఘటన తరువాత అటువంటి ఆత్మహత్యలు హిందీ పరిశ్రమతో పాటు సౌత్ లో కూడా జరిగాయి.

కన్నడ ఇండస్ట్రీలో ఓ సీరియల్ హీరో సూసైడ్ చేసుకున్నాడు.అలాగే తెలుగులో సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.

తాజాగా హిందీలో ఓ సీరియల్ నటుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే తమిళనాడులో తమిళ యువ నటుడు ఆత్మహత్య చేసుకున్న వార్త బయటకి వచ్చింది.

శివ కార్తికేయన్ మెరీనా సినిమాలో అతని ఫ్రెండ్ గా నటించిన యువ‌ న‌టుడు తెన్నార‌సు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

చెన్నైలోని మైలాపూర్‌లో మంగ‌ళ‌వారం త‌న నివాసంలో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.భార్య‌తో ఘ‌ర్ష‌ణ‌కు దిగిన‌ అనంత‌రం తీవ్ర మ‌న‌స్తాపానికి లోనై అత‌డు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.మూడేళ్ల క్రితం తెన్నార‌సు త‌ను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.

వీరిద్ద‌రికీ ఓ బిడ్డ కూడా ఉంది.తాగుడుకు బానిసైన ఈ నటుడు భార్య‌తో త‌ర‌చూ గొడవ‌కు దిగుతున్నాడ‌ని స్థానికులు చెప్తున్నారు.

మెరీనా సినిమాతో పాటు పలు తమిళ సినిమాలలో తెన్నారసు హీరో ఫ్రెండ్ పాత్రలలో కనిపించి మెప్పించాడు.కుటుంబ కలహాలే అతని మృతికి కారణమని పోలీసులు నిర్ధారించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube